ఐదు బోర్లు వేసినా చుక్కనీరు లేదు
నేను 5 ఎకరాల్లో చీనీ, 4 ఎకరాల్లో అరటి, 2 ఎకరాల్లో కళింగర పంటలు సాగు చేశాను. అయితే ఉన్నఫళంగా బోరు బావుల్లో నీటి మట్టం తగ్గిపోయింది. పంటలను కాపాడుకోవాలని రూ.5లక్షలు వెచ్చించి ఐదు బోర్లు వేయించాను. చుక్కనీరు పడలేదు. అరటి, కళింగర పంటలకు నీరందకపోవడంతో రూ.10 లక్షల వరకు నష్టపోయాను. చెట్లను కాపాడుకునేందుకు రోజుమార్చిరోజు రూ.4,200 ఖర్చు చేసి ట్యాంకర్‌తో నీటిని తోలిస్తున్నాను.
– సల్లాపురం బాల రమణారెడ్డి,
రైతు, కునుకుంట్ల


