ప్రశాంతి నిలయం: అభాగ్యులకు సేవలు అందించడమే సత్యసాయి సేవా సంస్దల లక్ష్యమని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె.రత్నాకర్ రాజు అన్నారు. బుధవారం ప్రశాంతి నిలయంలోని నార్త్ బిల్డింగ్స్ వద్ద సత్యసాయి దివ్యాంగ్జన్ ప్రాజెక్ట్ కార్యాలయంలో ప్రత్యేక అవసరాలున్న 113 మందికి కృత్రిమ అవయవాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రత్నాకర్ రాజు మాట్లాడుతూ.. సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో సత్యసాయి శత జయంతి వేడుకలను పురస్కరించుకుని సత్యసాయి దివ్యాంగ్జన్ ప్రాజెక్ట్‌ను చేపట్టడం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా స్వశక్తితో జీవిస్తున్న దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ అవయవాలు పంపిణీ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.