
గవర్నర్‌కు జ్ఞాపిక అందజేస్తున్న వీసీ జింకా రంగజనార్దన, రిజిస్ట్రార్ శశిధర్
పుట్టపర్తి అర్బన్: అట్టడుగు వర్గాల అభ్యున్నతికి, సమసమాజ స్థాపనకు కృషి చేసిన దార్శనికుడు జ్యోతిరావు పూలే అని డీఆర్‌ఓ కొండయ్య అన్నారు. మంగళవారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జ్యోతిరావు పూలే 133వ వర్దంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఓ కొండయ్య అధికారులు, సిబ్బందితో కలిసి పూలే చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ... అసమానతలు రూపుమాపడం, స్త్రీలకు విద్య అందించి వారి స్థితిగతులను మార్చడంతో పూలే ఎంతో కీలక పాత్ర పోషించారన్నారు. పూలే జీవితం మనందరికీ ఆదర్శం కావాలన్నారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల సంక్షేమ, సాధికారత శాఖ అధికారులు నిర్మలాజ్యోతి, మోహన్‌రామ్, శివరంగప్రసాద్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
నేడు నల్లమాడలో
‘జగనన్నకు చెబుదాం’
పుట్టపర్తి అర్బన్: ప్రజా సమస్య పరిష్కారం కోసం మండల స్థాయిలో నిర్వహించే ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని బుధవారం నల్లమాడలో ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ అరుణ్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. నల్లమాడ ఆర్డీటీ ఫీల్డ్ కార్యాలయంలో ఉదయం 9.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. మండల వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను అర్జీల రూపంలో అందిస్తే పరిష్కారానికి చర్యలు తీసుంటామన్నారు. కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని ఆయన వెల్లడించారు.
4న రాప్తాడులో సామాజిక సాధికార యాత్ర
కనగానపల్లి: డిసెంబర్ నాలుగో తేదీ రాప్తాడులో సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తెలిపారు. మంగళవారం కనగానపల్లి మండలం మద్దెలచెరువు, భానుకోట, కేఎన్ పాళ్యం, నరసంపల్లి, తగరకుంట గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా రాప్తాడులో జరిగే సామాజిక సాధికార యాత్రపై పార్టీ నాయకులు, కార్యకర్తలకు తెలియజేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామం నుంచి వందల సంఖ్యలో ప్రజలు వచ్చేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ భాగ్యమ్మ, జెడ్పీటీసీ మారుతీ ప్రసాద్, మండల అగ్రీ బోర్డు చైర్మన్ వెంకటరాముడు, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ అమరనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జేఎన్‌టీయూ స్నాతకోత్సవ నిర్వహణకు అనుమతి
అనంతపురం: జేఎన్‌టీయూ అనంతపురం స్నాతకోత్సవం నిర్వహించడానికి గవర్నర్/ ఛాన్సలర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ అనుమతి ఇచ్చారు. వీసీ జింకా రంగజనార్దన, రిజిస్ట్రార్ సి.శశిధర్ రాజభవన్‌లో గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి విన్నవించారు. స్నాతకోత్సవ నిర్వహణకు ఆయన సమ్మతించారని, తేదీ త్వరలోనే ఖరారు చేస్తామన్నారని వీసీ వెల్లడించారు.

జ్యోతిరావు పూలే చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న అధికారులు

తగరకుంటలో కార్యకర్తలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి