రౌడీషీటర్‌ దారుణ హత్య | - | Sakshi
Sakshi News home page

రౌడీషీటర్‌ దారుణ హత్య

Aug 31 2026 12:02 AM | Updated on Aug 31 2026 12:02 AM

నెల్లూరులో ఘటన

పాతకక్షలే కారణమా?

నెల్లూరు(క్రైమ్‌): రౌడీషీటర్‌ను కొందరు బండరాయితో తలపై కొట్టి అతి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన నెల్లూరులోని ఆర్టీఓ కా ర్యాలయ సమీపంలోని ఖాళీ స్థలంలో ఆదివా రం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. చంద్రమౌళి నగర్‌కు చెందిన లక్ష్మీశెట్టి సా యితేజ అలియాస్‌ కమ్మసాయి (24)పై వేదాయపాళెం పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్‌ ఉంది. గతేడాది పోలీసులు అతడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగించి జైలుకు పంపారు. ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చాడు. అనంతరం బుచ్చిరెడ్డిపాళెంలో ఉంటున్నట్లు తెలిసింది. ఆదివారం సాయితేజ వేదాయపాళెం పోలీస్‌స్టేషన్‌లో కౌన్సెలింగ్‌కు హాజరయ్యాడు. రాత్రి ఏం జరిగిందో తెలియదు గానీ గుర్తుతెలియని వ్యక్తులు అతడిని వెంబడించారు. ఆర్టీఓ కార్యాలయ సమీప ఖాళీ స్థలంలో సిమెంట్‌ రాయితో తలపై కొట్టి అతి కిరాతకంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న నగర ఇన్‌చార్జి, నెల్లూరు రూరల్‌ డీఎస్పీలు గిరిధర్‌, ఘట్టమనేని శ్రీనివాసరావు, వేదాయపాళెం ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ సీతారామయ్య తదితరులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్‌టీం ఆధారాలు సేకరించింది. హత్యకు గల కారణాలపై పోలీసులు లోతుగా ఆరాతీస్తున్నారు. హత్య వెనుక బీవీ నగర్‌కు ప్రాంతానికి చెందిన ఓ రౌడీషీటర్‌తోపాటు మరికొందరి ప్రమేయం ఉందని అనుమానిస్తున్నారు. పాతకక్షలే హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. విభిన్న కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement