కడుపు నింపుకోవడానికి ఎండను లెక్కచేయకుండా.. బరువును భుజాన మోస్తూ.. చెమటను చిందిస్తూ.. ప్రమాదాలను సైతం పట్టించుకోకుండా శ్రమిస్తుంటారు కార్మికులు. జీవితం సాఫీగా సాగేందుకు ఒక్కొక్కరిదీ ఒక్కో పోరాటం. పనిలో కష్టం ఎంత ఉన్నా.. ఆ శ్రమ వెనుక ఉన్నది మాత్రం కుటుంబాన్ని నడిపించాలనే తపనే. పాత వస్తువులను సేకరించి వాటిని అమ్ముకోవడం నుంచి.. బరువైన సామగ్రిని మోసే వరకు.. నిర్మాణ పనుల్లో ప్రమాదకర
పరిస్థితుల్లో పనిచేయడం నుంచి.. మండుటెండలో ధాన్యాన్ని ఆరబెట్టడం వరకు.. ఇలా పనులు వేరైనా లక్ష్యం మాత్రం ఒక్కటే. బతుకు బండి ఆగకూడదు. శ్రమను నమ్ముకున్న వారి జీవితాల్లో రోజూ ఓ పోరాటమే.
– సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు


