ఆక్వా రైతుల ఆక్రందన | - | Sakshi
Sakshi News home page

ఆక్వా రైతుల ఆక్రందన

Aug 3 2026 3:45 AM | Updated on Aug 3 2026 3:45 AM

తోటపల్లిగూడూరు(పొదలకూరు): ఆక్వా రైతుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని.. కన్నీటి వేదన చూడలేకపోతున్నామని.. వారి కష్టం దళారులు, వ్యాపారుల పరమవుతోందని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. తోటపల్లిగూడూరు మండలంలోని ఈదూరులో రైతులతో కలిసి రొయ్యలు, చేపల చెరువులను ఆదివారం పరిశీలించారు. వారితో ముఖాముఖీ మాట్లాడి సమస్యలను ఆరాతీసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఆక్వా రంగాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. కిలో మేత రూ.14 వరకు పెరగడాన్ని చూస్తే, సాగు కోలుకునే పరిస్థితి లేదని చెప్పారు. గత ప్రభుత్వంలో ఫీడ్‌ ధరలు పెరిగితే అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వెంటనే సమీక్షలు నిర్వహించి రేట్లను అదుపు చేసిన అంశాన్ని గుర్తుచేశారు. ఫీడ్‌ తయారీదారులతో ప్రస్తుత సర్కార్‌ కుమ్మకై ్క, రైతులకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు.

హేచరీస్‌ వైఫల్యంతోనే..

హేచరీస్‌పై ప్రభుత్వానికి ఎలాంటి అజమాయిషీ లేకపోవడంతో నాణ్యత లేని సీడ్‌ను సరఫరా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. లక్ష పిల్లలను తీసుకుంటే బోనస్‌గా మరో 30 వేల నుంచి 40 వేల మేర ఉచితంగా అందజేసినా, చివరికి 50 వేలు కూడా బతికే పరిస్థితి లేదని చెప్పారు. నాసిరకం సీడ్‌తో మోసం చేస్తున్నారని మండిపడ్డారు. హార్వెస్టింగ్‌ సమయంలో ఆదుకోవడంలేదని.. ఆక్వా ఉత్పత్తులను దళారులు, వ్యాపారులు దారుణంగా తగ్గిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు విసిగి వేసారి ఎంతో కొంతకు వారికే విక్రయిస్తున్నారని వివరించారు. ఫీడ్‌ తయారీదారులు దోపిడీ చేస్తున్నా, ప్రభుత్వం మౌనంగా ఉందంటే ఏమి అర్ధం చేసుకోవాలని ప్రశ్నించారు. వారితో లాలూచీ పడటంతోనే రెండుసార్లు మొత్తంగా కలిపి కిలోకు రూ.14 మేర పెంచారని తెలిపారు. ఫీడ్‌ ధరలు ఏటా పెరుగుతున్నా, చేపల రేట్లు మాత్రం తగ్గిపోతున్నాయని పేర్కొన్నారు. రొయ్యల సాగు రైతులకు యూనిట్‌ను రూ.1.50కు అమలు చేయాలని, సాగు విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఈ మేరకు అందజేయాలని డిమాండ్‌ చేశారు.

శ్రమ ఒకరిది.. ఫలితం మరొకరిది..

వరిసాగు మార్చి, ఏప్రిల్‌లో కోతలు పూర్తి కాగా, అప్పట్లో బీపీటీలు పుట్టి రూ.16 వేలు నుంచి రూ.17 వేలు.. షుగర్‌ లెస్‌ రూ.18 వేల మేరే పలికాయని తెలిపారు. ఆరుగాలం శ్రమించి అనేక కష్టనష్టాలకోర్చిన అన్నదాతలకు గిట్టుబాటు ధరలు లభించడంలేదన్నారు. మూడు నెలల వ్యవధిలో పుట్టి రూ.37 వేల నుంచి రూ.38 వేలకు పెరిగిందని చెప్పారు. పంటలకు సరైన మద్దతు ధరలు లభించడంలేదని.. వీరి నుంచి దళారులు, మిల్లర్లు తక్కువకు కొనుగోలు చేసి ధాన్యాన్ని నిల్వ ఉంచుకొని అధిక ధరలకు విక్రయిస్తున్నారని వివరించారు. ధరల స్థిరీకరణ నిధి లేకపోవడంతోనే ఇలాంటి నష్టాలను రైతులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆరోపించారు. కోతల సమయంలో సేకరించిన ధాన్యానికి సంబంధించిన నగదును ఇప్పటికీ కొందరు దళారులు చెల్లించలేదన్నారు. ధరల స్థిరీకరణ నిధికి రూ.మూడు వేల కోట్లను తమ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కేటాయించారని, వాణిజ్య పంటల ధరలు తగ్గకుండా మార్క్‌ఫెడ్‌, సివిల్‌ సప్లయ్స్‌ శాఖలను రంగంలోకి దించి కొనుగోలు చేయించిన అంశాన్ని ప్రస్తావించారు. నేతలు చిల్లకూరు సుధీర్‌రెడ్డి, శంకరయ్యగౌడ్‌, టంగుటూరు శ్రీనివాసులురెడ్డి, వంశీధర్‌రెడ్డి, సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

వారి కష్టం దళారులు, వ్యాపారుల పరం

కోలుకోలేని విధంగా దెబ్బతీసిన

కూటమి సర్కార్‌

మండిపడిన మాజీ మంత్రి

కాకాణి గోవర్ధన్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement