పుట్టిన రోజే అనంతలోకాలకు.. | - | Sakshi
Sakshi News home page

పుట్టిన రోజే అనంతలోకాలకు..

Aug 3 2026 3:45 AM | Updated on Aug 3 2026 3:45 AM

కేక్‌ కోసం స్నేహితుడితో కలిసి వెళ్తుండగా..

డివైడర్‌ను ఢీకొన్న బైక్‌

ఒడిశాకు చెందిన ఇద్దరు

యువకుల దుర్మరణం

కొడవలూరు: జన్మదినాన్ని తన స్నేహితులతో కలిసి ఎంతో సంతోషంగా జరుపుకోవాలని భావించారు. దీని కోసం కేక్‌ను తెచ్చుకోవాలని తన స్నేహితుడితో కలిసి బైక్‌పై బయల్దేరారు. తాను కోరుకుంది ఒకటైతే.. విధి మరోలా తలచింది. ఈ క్రమంలో జరిగిన ప్రమాదంలో ఒడిశాకు చెందిన ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన మండలంలోని రాచర్లపాడులో గల గమేశా ఫ్యాక్టరీ వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై కోటిరెడ్డి వివరాల మేరకు.. బీఎమ్మార్‌ సంస్థలో పనిచేస్తున్న ఒడిశాకు చెందిన సీతాకాంత్‌ (22) జన్మదినం ఆదివారం. ఈ క్రమంలో కేక్‌ నిమిత్తం నార్తురాజుపాళేనికి బైక్‌లో తన స్నేహితుడు బాదల్‌ మాలిక్‌ (24)తో కలిసి బయల్దేరారు. ఈ తరుణంలో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఎంతో ఉత్సాహంగా వెళ్లి.. వీరు విగతజీవులుగా మారడంతో స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు.

విగతజీవులుగా సీతాకాంత్‌, మాలిక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement