బ్యాంక్‌కు వెళ్తుండగా.. | - | Sakshi
Sakshi News home page

బ్యాంక్‌కు వెళ్తుండగా..

Apr 7 2026 7:25 AM | Updated on Apr 7 2026 7:25 AM

ట్రావెల్స్‌ బస్సు ఢీకొని వృద్ధుడి మృతి

దుత్తలూరు: ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీకొని ఓ వృద్ధుడు మృతిచెందిన ఘటన మండలంలోని తెడ్డుపాడు బీసీ కాలనీ వద్ద 565వ జాతీయ రహదారిపై సోమవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. చందులూరి బ్రహ్మానందం (74) మండలంలోని నర్రవాడలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌లో గోల్డ్‌ అప్రైజర్‌గా పనిచేస్తున్నాడు. తెడ్డుపాడు బీసీ కాలనీలో నివాసముంటున్నాడు. మధ్యాహ్నం ఇంటికెళ్లి భోజన అనంతరం తిరిగి నర్రవాడకు మోటార్‌బైక్‌పై బయలుదేరాడు. ఈ క్రమంలో బద్వేల్‌ నుంచి పామూరు వైపు వేగంగా వెళ్తున్న ఎస్‌ఆర్‌ ట్రావెల్స్‌ బస్సు బైక్‌ను ఢీకొట్టింది. బ్రహ్మానందం రోడ్డుపై పడి తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన బస్సును దుత్తలూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మృతుడి సొంతూరు ప్రకాశం జిల్లా రాళ్లపాడు కట్టకిందపల్లి. నర్రవాడ బ్యాంక్‌లో కొన్నేళ్లుగా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement