వేసవి తీవ్రత అధికమైన నేపథ్యంలో మనుషులు దాహార్తితో అల్లాడిపోతున్నారు. ఇక పక్షులు, మూగజీవాలు నీళ్ల కోసం పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. సోమవారం తీర ప్రాంతంలోని చింతవరం గ్రామంలో భారీ వాహనం వస్తున్నా లేగదూడ
నిలబడి రోడ్డుపై ఉన్న చిన్నపాటి గుంతలోని బురద నీటితో దాహం తీర్చుకోవడం చూపరులను కలచి వేసింది. సాగరమాల రహదారి నిర్మాణంలో భాగంగా గ్రావెల్, మట్టి తరలించే భారీ వాహనాలతో రోడ్డు పూర్తిగా దెబ్బతింది. దుమ్ము విపరీతంగా లేస్తుండటంతో రోడ్డుపై నీటిని పిచికారీ చేస్తుండగా గుంతల్లో నీరు నిలిచింది. నీళ్లు బురదగా ఉన్నా పట్టించుకోకుండా లేగదూడ దాహార్తిని తీర్చుకుంది. మూగజీవాన్ని చూసిన డ్రైవర్ కొంతసేపు వాహనాన్ని నిలిపివేశాడు.
– చిల్లకూరు


