● కలెక్టరేట్‌లో
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’
● వినతులు సమర్పించిన ప్రజలు
నెల్లూరు(దర్గామిట్ట): జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు నెల్లూరులోని కలెక్టరేట్‌కు తరలివచ్చారు. బారులు తీరి అర్జీలు సమర్పించారు. సోమవారం తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్ హిమాన్షు శుక్లా, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయ్‌కుమార్, తెలుగుగంగ స్పెషల్ కలెక్టర్ హరిశ్చంద్రారెడ్డి, తెలుగుగంగ స్పెషల్ అధికారి కేశవర్ధన్‌రెడ్డి, డీపీఓ వసుమతి, సర్వే ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ నాగశేఖర్ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ అప్‌లోడ్‌ను కొన్ని శాఖలు ఇంకా మొదలు పెట్టలేదన్నారు. మరికొన్ని శాఖలు వెనుకంజలో ఉన్నాయన్నారు. శాఖల వారీగా సమీక్షించి ఈనెల 8వ తేదీ లోపు ఆ ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశించారు.


