
సోమశిల @ 60 టీఎంసీలు
ఆత్మకూరు: సోమశిల జలాశయంలో నీటి నిల్వ గురువారం అర్థరాత్రికి 60 టీఎంసీలకు చేరింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, కృష్ణా నదికి వరద కొనసాగుతోంది. ఈ క్రమంలో కుందూ నదిలో 20 వేల క్యూసెక్కులకుపైగా ప్రవాహం నమోదైంది. ఆదినిమ్మాయిపల్లి మీదుగా 30 వేల క్యూసెక్కుల నీరు సోమశిలవైపు ప్రవహిస్తోంది. 18,400 క్యూసెక్కులకుపైగా వరదొస్తోందని అధికారులు తెలిపారు. డెల్టా, ఉత్తర, దక్షిణ కాలువలకు కలిపి 12,740.. కండలేరు జలాశయానికి 10,200 క్యూసెక్కులను విడుదల చేస్తున్నామని అధికారులు తెలిపారు.
పోక్సో కేసులో
సంచలన తీర్పు
● నిందితుడికి 20 ఏళ్ల జైలు,
రూ.20 వేల జరిమానా
నెల్లూరు (లీగల్): బాలికను ఇంటి నుంచి బలవంతంగా తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారని నమోదైన కేసులో నేరం రుజువు కావడంతో తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తీపనూరుకు చెందిన నిందితుడు కన్నా శ్రీనివాసులుకు 20 ఏళ్ల జైలుతో పాటు రూ.20 వేల జరిమానా విధిస్తూ నెల్లూరు ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి సిరిపిరెడ్డి సుమ గురువారం తీర్పుచెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. చిల్లకూరు మండలం తీపనూరుకు చెందిన 17 ఏళ్ల బాలిక తన తల్లిదండ్రులతో ఉంటూ చదువుకొనేది. నాయుడుపేటలోని తెల్వయిపాడులో తెలిసిన వారి ఇంటికి 2021 జూలై 14న బాలిక తల్లిదండ్రులు వెళ్లారు. తిరిగి అదే రోజు సాయంత్రం ఇంటికొచ్చి చూడగా, బాలిక కనపడలేదు. చుట్టుపక్కల విచారించిన అనంతరం జూలై 17న చిల్లకూరు పోలీసులకు బాలిక తల్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం శ్రీనివాసులుపై కోర్టులో చార్జిషీట్‌ను దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో పైమేరకు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దూబిశెట్టి చంద్రశేఖర్ వాదించారు.
● కొనసాగుతున్న ప్రవాహం
● ఆగస్ట్‌లోనే ఈ స్థాయికి చేరడంపై హర్షం