నెల్లూరు(క్రైమ్): నెల్లూరు మినీబైపాస్ రోడ్డులోని పూలేబొ మ్మ సమీపంలో కారు స్టాండ్ వెనుక సర్వేపల్లి కాలువలో శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకొచ్చింది. స్థానికులు ఈ విషయాన్ని వీఆర్వో సుబ్బలక్ష్మమ్మ తెలియజేశారు. ఆమె బాలాజీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహకారంతో మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి వయసు 48 నుంచి 50 ఏళ్లలోపు ఉండొచ్చని భావిస్తున్నారు. గులాబీ రంగు చొక్కా, సిమెంట్ రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలిసిన వారు తెలియజేయాలని ఇన్‌స్పెక్టర్ సాంబశివరావు తెలిపారు. బహిర్బూమికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడ్డాడా? ఆత్మహత్య చేసుకున్నాడా? మరే ఇతర కారణం ఏమైనా ఉందా అని ఆరా తీస్తున్నారు.