
జాబ్‌మేళాలను సద్వినియోగం చేసుకోండి
ఆత్మకూరు: జాబ్‌మేళాలను నిరుద్యోగ యువత స ద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర దేవదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆంధ్రా ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం ప్రభుత్వ సలహాదారు, డీఆర్‌డీఓ మాజీ చైర్మన్ గుండ్రా సతీష్‌రెడ్డి సహకారంతో భారీ జాబ్‌మేళాను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ ఆన్‌లైన్ ద్వారా, నేరుగా మొత్తం 2,347 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్నారు. 93 కంపెనీలు పాల్గొన్నట్లు చెప్పారు. కలెక్టర్ ఒ.ఆనంద్, టిడ్కో చైర్మన్ అజయ్‌కుమార్, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్, ఆర్టీసీ రీజినల్ చైర్మన్ సురేష్‌రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ కానిస్టేబుళ్ల
తుది ఫలితాల విడుదల
నెల్లూరు(క్రైమ్): కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించిన తుది ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఎంపికై న 158 మందితో కూడిన ఫైనల్ లిస్టును అధికారులు జిల్లా పోలీసు కార్యాలయంలో అందుబాటులో ఉంచారు. వీరు త్వరలో తొమ్మిదినెలలపాటు శిక్షణకు వెళ్లనున్నారు.