
సిండికేట్ వసూళ్లు ఇలా..
30 గనుల్లో లభించే మైకా క్వార్ట్ ్జను దిగుమతి చేసేందుకు చైనా, జపాన్ దేశాల్లో అనుమతి ఉంది. దీంతో ఆయా గనుల నుంచి వచ్చే ఖనిజాలను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇక్కడ లభించే ఖనిజం రకాలను బట్టి రూ.20 వేల నుంచి రూ.85 వేల వరకు ధర పలుకుతోంది. టన్ను రూ.20 వేల చొప్పున అమ్మితే సిండికేట్‌కు రూ.4 వేలు కప్పం కట్టాలి. అదే టన్ను రూ.85 వేలకు అమ్మితే రూ.20 వేల పైన ఇవ్వాలి. దానికితోడు మరో ముఖ్యనేతలకు ఇవ్వాల్సి వస్తోంది. దీంతో గనుల యజమానులు లబోదిబోమంటున్నారు. అలాగే కొన్ని యార్డులకు కూడా అనుమతులను మంజూరు చేశారు. వాటికి కూడా ఆ వంతునే నగదును సిండికేట్‌కు చెల్లించాలి. ముఖ్యంగా సైదాపురం మండలంలో వివిధ ప్రాంతాల్లో సీసీ కెమెరాలను కూడా సిండికేట్ రాయుళ్లు ఏర్పాటు చేసి నిఘా పెట్టారు. కార్యాలయం కూడా సైదాపురం – ఊటుకూ రు మధ్యలో ఏర్పాటు చేయడం గమనార్హం.