
అవయవదానంతో 8 మందికి పునర్జన్మ
● జీవన్‌దాన్ ఏపీ చైర్మన్ రాంబాబు
నెల్లూరు(అర్బన్): అవయవదానంతో ఎనిమిది మందికి పునర్జన్మ ప్రసాదించవచ్చని జీవన్‌దాన్ ట్రస్ట్ ఏపీ చైర్మన్ డాక్టర్ రాంబాబు అన్నారు. శుక్రవారం సాయంత్రం నెల్లూరులో ఓ కన్వెన్షన్ హాల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం అపోలో ఆస్పత్రిలో క్యాంప్ ఉంటుందన్నారు. బ్రెయిన్‌డెడ్ అంటే ఏంటి?, అవయవదానాన్ని చట్టబద్ధంగా ఎలా చేయాలి? అనే అంశాలను వివరిస్తామన్నారు. మూడో తేదీన నేషనల్ ఆర్గాన్ డొనేషన్‌డేను పురస్కరించుకుని వీఆర్‌సీ సెంటర్ నుంచి భారీ ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో కార్యక్రమం జరుగుతుందన్నారు. జీవన్‌దాన్ సంస్థలో ఇప్పటికే 4,733 మంది అవయవాల కోసం రిజిస్టర్ చేసుకున్నారన్నారు. కార్యక్రమంలో వివిధ ఆస్పత్రుల ప్రతినిధులు డాక్టర్ శ్రీరాంసతీష్, బాలరాజు, డాక్టర్ సతీష్, శేఖర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, సురేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.