విలువలకు పాతర | - | Sakshi
Sakshi News home page

విలువలకు పాతర

Mar 28 2025 12:10 AM | Updated on Mar 28 2025 12:10 AM

విలువ

విలువలకు పాతర

ప్రలోభాల ఎర..
గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్ల తిరస్కరణకు గురై పెద్ద సున్నాకే పరిమితమైన టీడీపీ.. ప్రస్తుతం అధికార మదంతో విలువలకు పాతరేసి.. ప్రలోభాలను ఎరవేసి ఎంపీపీ స్థానాన్ని దక్కించుకుంది. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఎన్నికల్లో ఇలా ఎంపీపీ పదవిని దక్కించుకొని ప్రజా తీర్పును అపహాస్యం చేసింది. ఎంపీటీసీలు వారి స్వలాభం కోసం.. అందలమెక్కించిన తమను నిలువునా మోసం చేశారనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది.

దగదర్తి వైస్‌ ఎంపీపీ ఎన్నిక నేటికి వాయిదా

కావలి: దగదర్తి వైస్‌ ఎంపీపీ పదవికి గురువారం నిర్వహించాల్సిన ఎన్నిక శుక్రవారానికి వాయిదా పడింది. మండలంలో 11 మంది ఎంపీటీసీలు ఉండగా, వీరిలో శ్రీరామపురం ఎంపీటీసీ సభ్యురాలు పీతల కామేశ్వరమ్మ వైస్‌ ఎంపీపీగా ఉండేవారు. మండలంలోని చెన్నూరు సచివాలయంలో విలేజ్‌ వెటర్నరీ అసిస్టెంట్‌గా ఉద్యోగం రావడంతో తన పదవులకు ఆమె రాజీనామా చేశారు. మండలంలో ప్రస్తుతం పది మంది ఎంపీటీసీలకు గానూ ఎంపీపీ, ఒక వైస్‌ ఎంపీపీ ఉన్నారు. ఖాళీ అయిన రెండో వైస్‌ ఎంపీపీని మిగిలిన ఎనిమిది మంది ఎన్నుకోవాల్సి ఉంది. ఈ తరుణంలో ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎన్నికను నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు. దీనికి ఎన్నికల అధికారులుగా పంచాయతీరాజ్‌, నెల్లూరు ఈఈ సుబ్బరాజు, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఉదయం 11 గంటలు దాటినా ఎంపీటీసీలెవరూ హాజరుకాలేదు. మరో గంటను అదనంగా కేటాయించినా, ఇదే పరిస్థితి ఏర్పడింది. దీంతో కోరం లేకపోవడంతో ఎన్నికను శుక్రవారానికి వాయిదా వేస్తున్నామని ప్రకటించారు. కావలి రూరల్‌ సీఐ పాపారావు ఆధ్వర్యంలో దగదర్తి ఎస్సై జంపానికుమార్‌ తదితరులు బందోబస్తు చర్యలు చేపట్టారు.

ధనాన్ని వెదజల్లి ఎంపీపీ స్థానాన్ని దక్కించుకున్న టీడీపీ

నాడు తిరస్కరణకు గురై..

సున్నాకే పరిమితం

ఓట్లేసిన ప్రజలను

వంచించిన ఎంపీటీసీలు

విడవలూరు: మూడున్నరేళ్ల క్రితం నిర్వహించిన ఎంపీటీసీ ఎన్నికల్లో ఒక్క స్థానాన్నీ దక్కించుకోలేక టీడీపీ చతికిలపడింది. ప్రజాతీర్పుతో కళ్లుబైర్లు కమ్మి.. తమ స్థానమేమిటో తెలుసుకున్న ఆ పార్టీ నేడు అధికార బలంతో విర్రవీగి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో గెలుపొందిన ఏడుగురు ఎంపీటీసీలను ప్రలోభాలకు గురిచేసి.. అభివృద్ధిని చూసి తమ వెంట వచ్చారంటూ ఊదరగొట్టి ఎంపీపీ స్థానాన్ని దక్కించుకుంది. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఈ ఎన్నిక వింత రాజకీయాలకు వేదికై ంది. ఈ పరిణామాలను చూసి ప్రజలు నివ్వెరబోయారు.

నాడిలా..

2021లో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలోని 14 ఎంపీటీసీ స్థానాలకు గానూ 12 స్థానాలను వైఎస్సార్సీపీ, మిగిలిన రెండింటిని సీపీఎం దక్కించుకున్నాయి. విడవలూరుకు చెందిన వేణుంబాక భవానమ్మను ఎంపీపీగా ఎన్నుకున్నారు. అయితే ఈ ఏడాది జనవరి 29న అనారోగ్యంతో ఆమె మృతి చెందారు. తదనంతరం అదే పార్టీ మద్దతుదారైన ముదివర్తికి చెందిన కాయల సౌందర్య ఇన్‌చార్జి ఎంపీపీగా వ్యవహరిస్తూ వచ్చారు.

పచ్చ కండువాలు కప్పి..

గతేడాది నిర్వహించిన శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి చెందిన కొందరు నేతలు టీడీపీ పంచన చేశారు. వీరితో పాటు ఇద్దరు ఎంపీటీసీలూ పచ్చ కండువా కప్పుకొన్నారు. మారిన రాజకీయ పరిణామాలతో ఊటుకూరుకు చెందిన ఏకుల శేషమ్మను తమ అభ్యర్థిగా ప్రకటించారు. దీనికి వైఎస్సార్సీపీ మద్దతుదారులు, ఇద్దరు సీపీఎం ఎంపీటీసీల మద్దతూ లభించింది. దీంతో వీరు చూపు మిగిలిన వైఎస్సార్సీపీ ఎంపీటీసీలపై పడింది. వీరిని అనేక రకాలుగా ప్రలోభాలకు గురిచేశారు.

రాత్రికి రాత్రే..

ఈ క్రమంలో బుధవారం రాత్రికి రాత్రే మండలంలోని ఐదుగురు ఎంపీటీసీల ఇళ్ల వద్దకు కార్లు రావడం.. ఫోన్లు స్విచ్ఛాఫ్‌ అయిపోవడం వెనువెంటనే జరిగిపోయాయి. మరోవైపు ఎంపీపీ పదవి టీడీపీ కై వసం అనే మెసేజ్‌ను విడవలూరు మండలాధికారులు అనే వాట్సాప్‌ గ్రూపులో టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్ధిగా పోటీ చేసిన బాలకృష్ణ అనే వ్యక్తి పోస్ట్‌ చేయడం చర్చకు దాతీసింది.

అదృశ్యమై.. ఎన్నికకు ముందు ప్రత్యక్షం

కనిపించకుండా పోయిన ఎంపీటీసీలు, మరికొందరు స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్దకు టీడీపీ నేతలతో కలిసి చేరుకున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా ఎంపీడీఓ కార్యాలయం వద్దకు చేరుకొని, ఏకుల శేషమ్మను ఎంపీపీగా ఎన్నుకున్నారు. దీంతో కోరం పూర్తయిందని అధికారులు వెల్లడించారు. పీఆర్‌ డీఈఈ మోహన్‌రావు, జెడ్పీ సీఈఓ విద్యారమ, ఎంపీడీఓ నగేష్‌కుమారి, తహసీల్దార్‌ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

విలువలకు కట్టుబడిన నలుగురు

టీడీపీ నేతలు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా, నలుగురు ఎంపీటీసీలు లొంగలేదు. తమకు అవకాశమిచ్చిన వైఎస్సార్సీపీకి.. నమ్మి గెలిపించిన ప్రజలకు ద్రోహం చేయకుండా విలువలకు కట్టుబడి పలువురి ప్రశంసలను అందుకున్నారు.

ఇది తీసుకొని.. మాకు జై కొట్టండి..

ఏకపక్షంగా..

పొదలకూరు: మండలంలోని తాటిపర్తి పంచాయతీ ఉప సర్పంచ్‌ ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతు వార్డు సభ్యులు పాల్గొనకపోవడంతో ప్రక్రియను ఏకపక్షంగా పూర్తి చేశారు. తాటిపర్తి సమస్యాత్మక గ్రామం కావడంతో నెల్లూరు రూరల్‌ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 144 సెక్షన్‌ను విధించారు. పంచాయతీ మూడో వార్డు సభ్యురాలు కర్పూరం పెంచలలక్ష్మమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వాస్తవానికి ఇక్కడ మొత్తం 14 వార్డులుండగా, టీడీపీ మద్దతుదారులు ఐదుగురున్నారు. ఇటీవల టీడీపీ శిబిరంలో ముగ్గురు చేరడంతో వారి బలం పెరిగింది. దీంతో పెంచలలక్ష్మమ్మ ఎన్నిక ఏకగ్రీవమైంది. బందోబస్తును పొదలకూరు సీఐ శివరామకృష్ణారెడ్డి, ఎస్సై హనీఫ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఎన్నిక ప్రక్రియను పంచాయతీ ఇన్‌చార్జి సెక్రటరీ సురేష్‌ నిర్వహించారు.

విలువలకు పాతర 1
1/2

విలువలకు పాతర

విలువలకు పాతర 2
2/2

విలువలకు పాతర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement