నెల్లూరు(క్రైమ్): బాత్‌రూమ్‌లో జారిపడి గాయాలపాలైన ఓ వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు శెట్టిగుంటరోడ్డులో కె.కోటేశ్వరరావు (65) కుటుంబం నివాసం ఉంటోంది. ఆయన కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నాడు. సోమవారం తన ఇంట్లోని బాత్‌రూమ్‌లో జారిపడి గాయపడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు జీజీహెచ్‌లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి కోటేశ్వరరావు మృతిచెందాడు. మృతుడి కుమారుడు శివ మంగళవారం నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు.
44 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
నెల్లూరు రూరల్: జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 44 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జేసీ కె.కార్తీక్ తెలిపారు. మంగళవారం 3 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లుగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు రూ.96.61 కోట్లను రైతులకు చెల్లించినట్లు తెలియజేశారు.
నిమ్మ
ధరలు (కిలో)
పెద్దవి : రూ.75
సన్నవి : రూ.55
పండ్లు : రూ.30


