ఉదయగిరి: టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అన్ని అంశాల్లో విఫలమైందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తులసీరెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఉదయగిరిలో విలేకరులతో ఆదివారం ఆయన మాట్లాడారు. సూపర్‌సిక్స్ పేరిట హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వాటిని అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలో మద్యం, డ్రగ్స్, గంజాయి ఏరులై పారుతోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగుతోందని గత ప్రభుత్వంతో పోలిస్తే ఎక్కువ అప్పులు చేస్తోందని మండిపడ్డారు. నేతలు అనిల్‌కుమార్‌రెడ్డి, మద్దూరు రాజగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


