ఐసీడీఎస్‌లోనూ అదే తీరు | - | Sakshi
Sakshi News home page

ఐసీడీఎస్‌లోనూ అదే తీరు

Mar 23 2025 12:10 AM | Updated on Mar 23 2025 12:11 AM

పెద్ద మొత్తంలో స్వాహా

జిల్లాలో ఐసీడీఎస్‌, విద్యాశాఖలు అవినీతి మయంగా మారాయి. క్షేత్రస్థాయిలో పనిచేసే అంగన్‌వాడీల విధులను పర్యవేక్షించే అధికారుల నుంచి ప్రాజెక్ట్‌ కార్యాలయం వరకు అడుగడుగునా ప్రతి బిల్లులో కమీషన్లు కొట్టేస్తున్నారు. ప్రాజెక్ట్‌ స్థాయి సమావేశాలకు వెళ్లినా.. సెక్టార్‌ స్థాయి సమావేశాలకు వెళ్లినా కనీసం టీఏ బిల్లులు ఇవ్వకుండానే ఇచ్చేసినట్లు కాజేస్తున్న పరిస్థితి. ఇటీవల అంగన్‌వాడీలకు విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘జ్ఞానజ్యోతి’, ఐడీసీఎస్‌ ఆధ్వర్యంలో పోషణ్‌ భీ, పఢాయి భీ ట్రైనింగ్‌ ప్రొగ్రామ్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వీరికి ఏర్పాటు చేసిన భోజనం, స్నాక్స్‌ నిధుల్లో ఎంఈఓలు కుక్కుర్తి చూపించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ శిక్షణకు హాజరైన కొన్ని ప్రాజెక్ట్‌ల అంగన్‌వాడీలకు ఇంత వరకు టీఏ బిల్లులు చెల్లించలేదని తెలుస్తోంది.

నేను తిన్న

బిల్లులు అరగడం లేదు

గత నెలలో అంగన్‌వాడీలకు

‘జ్ఞానజ్యోతి’ ట్రైనింగ్‌

ఈ నెలలో పోషణ్‌ భీ, పఢాయి భీ కార్యక్రమం

భోజనం, స్నాక్స్‌లో కక్కుర్తి

టీఏ బిల్లులూ అందరికీ చెల్లించని వైనం

టీఏ

బిల్లులు

ఉదయగిరి: ఐసీడీఎస్‌, విద్యా శాఖల్లోని కొందరు అధికారులు అవినీతిలో మునిగి తేలుతున్నారు. గత నెలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘జ్ఞాన జ్యోతి, ఈ నెలలో ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో పోషణ్‌ భీ, పఢాయి భీ శిక్షణా కార్యక్రమాల నిర్వహణకు మంజూరు చేసిన భోజనం, స్నాక్స్‌, టీఏ, స్టేషనరీ నిధులను భారీగా మెక్కినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు మెరుగైన విద్యాబోధన కోసం జిల్లా వ్యాప్తంగా సెక్టార్‌ స్థాయిలో కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. ఇందులో అంగన్‌వాడీలకు అందించిన భోజనం, స్టేషనరీ సామగ్రి కొనుగోలు, రవాణా ఖర్చులు (టీఏ), స్నాక్స్‌ తదితరాల్లో కొంత మంది నిర్వాహకులు చేతివాటం ప్రదర్శించి నిధులు స్వాహా చేశారు. రోజంతా కష్టపడితే అంతంత మాత్రం వేతనాలు వచ్చే చిరుద్యోగుల కడుపు కొట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో 12 ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ల పరిఽధిలో 2,934 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చుతోంది. 3 నుంచి 6 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న చిన్నారులకు ఆట, పాటతో కూడిన చదువులు అందించేలా ‘జ్ఞానజ్యోతి’ పేరిట ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల ఎంఈఓల ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలకు రెండు విడతలుగా గత నెల 18వ తేదీ నుంచి ఆరు రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. ఇందు కోసం ప్రభుత్వం ప్రతి కార్యకర్తకు రోజుకు భోజనం, స్నాక్స్‌ కోసం రూ.300 కేటాయించింది. టీఏ కింద రూ.50, స్టేషనరీ మెటీరియల్‌ కోసం మరో రూ.100 కేటాయించారు. అయితే భోజనం, స్నాక్స్‌ కోసం కేవలం రూ.80 నుంచి రూ.100 వరకే ఖర్చు చేసినట్లు సమాచారం. కొన్ని కేంద్రాల్లో కనీసం మంచినీరు, స్నాక్స్‌ కూడా ఇవ్వలేదు. మధ్యాహ్న భోజనం అత్యంత నాసిరకంగా అందించారు. అప్పటికప్పుడే చెల్లించాల్సిన టీఏలు ఇంత వరకు ఇవ్వలేదని కొందరు అంగన్‌వాడీలు ఆరోపిస్తున్నారు. ఇక స్టేషనరీ సామగ్రి కొనుగోలు విషయంలోనూ అదే తంతు. ఈ నెలలో మూడు రోజుల పాటు ఐడీసీఎస్‌ ఆధ్వర్యంలో పోషణ్‌ భీ, పఢాయి భీ కార్యక్రమాలపై అంగన్‌వాడీలకు శిక్షణ ఇచ్చారు. ఐసీడీఎస్‌ సీడీపీఓలు, సూపర్‌వైజర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం కోసం ప్రతి కార్యకర్తలకు రూ.450 ప్రభుత్వం కేటాయించింది. ఇందులో భోజనం, స్నాక్స్‌ కోసం రూ.250, సామగ్రి కొనుగోలుకు రూ.50, టీఏ కోసం రూ.150 ఖర్చు చేయాలి. ఈ కార్యక్రమంలో కూడా అధికారులు చేతివాటం ప్రదర్శించారు. భోజనం, స్నాక్స్‌ కోసం రూ.80 నుంచి రూ.100 వరకు ఖర్చు చేశారు. టీఏ రూ.150 ఇవ్వలేదు.

అంగన్‌వాడీ కేంద్రం

అయినా

భోజనం బిల్లులు కూడా వదలరా మీరు..! ఊరకే వచ్చిన భోజనం బిల్లులు, టీఏ బిల్లులు అంత అతిగా తింటే ఇలానే

ఉంటుంది.

జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తలు రెండు శాఖల ఆధ్వర్యంలో 2,900 మంది శిక్షణ తీసుకున్నారు. విద్యాశాఖ పర్యవేక్షణలో జరిగిన శిక్షణలో ప్రతి కార్యకర్త నుంచి ఒక్క భోజనం కోసమే కేటాయించిన నిధుల్లో రోజుకు రూ.200 లెక్కన స్వాహా చేశారు. ప్రతి రోజు రూ.5.80 లక్షలు, ఆరు రోజులకు రూ.34.80 లక్షలు మింగేశారు. టీఏ కోసం రూ.8.70 లక్షలు కేటాయించగా, ఇంత వరకు చాలా మందికి అందలేదు. కొంతమంది ఎంఈఓలు టీఏలు ఇవ్వగా, మరి కొంతమంది ఆలస్యమైతే మర్చిపోతారులే అని జాప్యం చేస్తూ ఇంకా బడ్జెట్‌ రాలేందటూ దాటవేస్తున్నారు.

ఈ శాఖ ఆధ్వర్యంలో కూడా అదే దందా కొనసాగింది. భోజనం, స్నాక్స్‌ కోసం రూ.100 ఖర్చు చేసి రూ.150 స్వాహా చేశారు. వింజమూరు ప్రాజెక్ట్‌లో అయితే కనీసం మంచినీరు, స్నాక్స్‌ కూడా ఇవ్వలేదు. ఇందులో కూడా భోజనంలో రూ.13 లక్షలు స్వాహా చేశారు. టీఏ రూపంలో ప్రతి కార్యకర్తకు రోజుకు రూ.150 లెక్కన రూ.450 ఇవ్వాల్సి ఉంది. ఇంత వరకు పైసా కూడా ఇవ్వలేదు. ఎవరైనా అడిగితే వేధింపులు తప్పువని ఎవరూ సాహసం చేసి సీడీపీఓలను టీఏ అడగలేకపోతున్నామని పలువురు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికారులు సమగ్ర దర్యాప్తు చేసి ఇందులో ప్రమేయం ఉన్న వారిపై చర్యలు తీసుకొని కార్యకర్తలకు రావాల్సిన టీఏలు ఇప్పించాల్సిన అవససరం ఉంది. ఈ విషయమై అధికారులను వివరణ కోరగా నిబంధనల మేరకే వ్యవహరించామని తెలిపారు. టీఏ విషయంలోనూ, భోజనం ఖర్చు విషయం గురించి సమగ్ర సమాచారం ఇవ్వకుండా దాటవేశారు.

ఐసీడీఎస్‌లోనూ అదే తీరు1
1/2

ఐసీడీఎస్‌లోనూ అదే తీరు

ఐసీడీఎస్‌లోనూ అదే తీరు2
2/2

ఐసీడీఎస్‌లోనూ అదే తీరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement