
రక్షించుకుంటున్నాం
సోమశిల/ఆత్మకూరు: నాలుగునెలల పాటు ఎరువులు, పిండి వేసి ఏపుగా పెంచుకున్న వరి పైరును కంకి దశలో దుప్పులు, అడవి పందులు, కొన్ని గ్రామాల్లో ఎలుగుబంట్లు రాత్రి వేళల్లో తొక్కి నాశనం చేస్తుంటాయి. అవి తిరిగిన మేర పొలంలో పైరు నేలవాలడం, వడ్ల గింజలు రాలిపోవడం జరుగుతుంది. దీంతో రైతులు ఆర్థికంగా నష్టపోతుంటారు. రాత్రి వేళల్లో జంతువుల బారి నుంచి పైర్లను కాపాడుకునేందుకు కాపలా కాయడం కష్టమైన పని. ఆ సమయంలో విష పురుగుల బారిన పడి మృతిచెందిన అన్నదాతలు ఎందరో ఉన్నారు. ఈ పరిస్థితుల నుంచి పైర్లను రక్షించుకునేందుకు అనంతసాగరం మండలంలోని పెన్నాతీరం, కొండ, అటవీ ప్రాంతాల గ్రామాలైన గార్లదిన్నెపాడు, చిలకలమర్రి, పాతదేవరాయపల్లి, శంకరనగరం గ్రామాల రైతులు వినూత్నంగా ఆలోచించారు.
ఏం చేస్తున్నారంటే..
రైతులు మైక్‌లను వినియోగిస్తున్నారు. ముందుగానే జంతువులను తరుముతున్నట్లుగా అరవడం, పళ్లెం లేదా డప్పు మోగించడం తదితర శబ్దాలను రికార్డు చేసి ఉంచుతారు. దీనిని ఆన్ చేసి తమకు కావాల్సిన ప్రాంతంలో పెట్టి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. చిన్న రైతులు ఎకరాకు ఒకటి పెడుతుండగా, ఎక్కువ పొలం ఉన్న వారు 4, 5 సెట్లను ఏర్పాటు చేస్తున్నారు. దీని నుంచి వచ్చే శబ్దాలతో జంతువులు పొలాల్లోకి వచ్చేందుకు భయపడుతున్నాయి. ఆ నాలుగు గ్రామాల్లో రైతులు ఈ పద్ధతిని అనుసరిస్తుండటంతో వారికి అడవి జంతువుల బాధలు తప్పాయి. అదే విధంగా పగటి వేళల్లో పక్షుల నుంచి పైర్లను రక్షించుకునేందుకు మెరిసే రిబ్బన్లను (అగ్ని రిబ్బన్లు) పొలాల్లో అక్కడక్కడా ఏర్పాటు చేస్తున్నారు. సూర్యరస్మి రిబ్బన్లపై పడినప్పుడు పక్షుల కళ్లు భ్రమిస్తాయి. దీంతో అవి పైరుపై వాలకుండా వెళ్లిపోతాయి. ఇలా ఓ వైపు తమ పైరును రక్షించుకోవడంతోపాటు మూగ జీవాల ప్రాణాలను రక్షించేలా రైతులు అనుసరిస్తున్న ఈ విధానాలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.
ఆరుగాలం కష్టించి పండించే పైరు అడవి జంతువుల పాలవుతుంటుంది. రక్షణ కోసం కఠిన పద్ధతుల వల్ల అవి మృతిచెందడమో, గాయపడటమో జరుగుతుంది. ఈ సమయంలో కేసులతో పోలీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. కొందరు రైతులు తమ వరి పైరును కాపాడుకునేందుకు.. మూగజీవాలకు హాని కలగకుండా వినూత్న పద్ధతులను అవలంబిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
వరి పైరు రక్షణకు రైతుల చర్యలు
అడవి జంతువులకు హాని చేయకుండా..
మైక్‌లను పెడుతున్న వైనం
జంతువుల వల్ల పైరు దెబ్బతింటుండేది. నాలుగేళ్ల క్రితం మైక్‌లను పెట్టాం. జంతువులు పొలాల వద్దకు రావడం లేదు. వాటి బారి నుంచి పైర్లను రక్షించుకుంటున్నాం. ఎండ, వాన, మంచు నుంచి మైకులు పాడవకుండా ప్లాస్టిక్ కవర్లు చుట్టి కర్రలకు కట్టి పెడుతున్నాం.
– నరేంద్ర, రైతు

రక్షించుకుంటున్నాం

రక్షించుకుంటున్నాం