డీకేడబ్ల్యూ కళాశాలకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

డీకేడబ్ల్యూ కళాశాలకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు

Mar 20 2025 11:55 PM | Updated on Mar 20 2025 11:55 PM

డీకేడ

డీకేడబ్ల్యూ కళాశాలకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు

నెల్లూరు(టౌన్‌): మహిళా విద్యకు ప్రాధాన్యమిస్తున్న డీకేడబ్ల్యూ కళాశాలకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉందని విక్రమ సింహపురి యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ సునీత అన్నారు. కళాశాల ఏర్పడి 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వజ్రోత్సవ సంబరం గురువారంతో ముగిసింది. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు కళాశాల నుంచి కేవీఆర్‌ సెంటర్‌ వరకు వజ్రోత్సవ ర్యాలీని నిర్వహించారు. అనంతరం పూర్వ, ప్రస్తుత అధ్యాపకులను ఘనంగా సన్మానించారు. పూర్వ విద్యార్థులు ఎన్నో ఏళ్ల తర్వాత ఒకరినొకరు కలుసుకోవడంతో సెల్ఫీలు తీసుకున్నారు. రిజిస్ట్రార్‌ సునీత మాట్లాడుతూ రానున్న రోజుల్లో కళాశాల మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. నుడా చైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ చదువుకున్న పాఠశాల, కళాశాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత పూర్వ విద్యార్థులపై ఉందన్నారు. దొడ్ల కౌసల్యమ్మ మేనల్లుడు సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ డీకేడబ్ల్యూలో చదివిన ఎందరో నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారని కొనియాడారు. సినిమా హీరో చిరంజీవి సోదరి విజయదుర్గ మాట్లాడుతూ వజ్రోత్సవ సంబరాలకు హాజరుకావడం ఆనందంగా ఉందన్నారు. ఎంతోమంది స్నేహితులను కలిసినట్లు చెప్పారు. ఇంకా పూర్వ ప్రిన్సిపల్‌ మస్తానయ్య, పూర్వ ప్రిన్సిపల్‌ శైలజ, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి సతీమణి, పూర్వ విద్యార్థిని హేమావతి మాట్లాడారు. సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పూర్వ అధ్యాపకులు గంగాధర్‌రెడ్డి, వైస్‌ ప్రిన్సిపల్‌ ఏవీ రమణారావు పాల్గొన్నారు.

వీఎస్‌యూ రిజిస్ట్రార్‌ సునీత

ముగిసిన వజ్రోత్సవ సంబరం

చాలా ఆనందంగా ఉంది

డీకేడబ్ల్యూ కళాశాల వజ్రోత్సవాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఆశించిన స్థాయిలో పూర్వ విద్యార్థులు ఈ వేడుకలను తరలివచ్చారు. డీకేడబ్ల్యూ డిగ్రీ కళాశాలలో చదువుకున్న ఎందరో నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. డీకేడబ్ల్యూ కళాశాలలో చదువుకున్నందుకు గర్వ పడుతున్నా.

– జ్యోతిరెడ్డి, అధ్యక్షురాలు, పూర్వ విద్యార్థుల సంఘం

విజయవంతానికి కృషి చేశాం

డీకేడబ్ల్యూ వజ్రోత్సవానికి విచ్చేసిన వారికి కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఎన్నోరోజులు కృషి చేశాం. ఎంతో దూరం నుంచి పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. సంవత్సరాల తర్వాత అందరం ఒకచోట నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం ఆనందంగా ఉంది.

– కుసుమకుమారి, కార్యదర్శి, పూర్వ విద్యార్థుల సంఘం

డీకేడబ్ల్యూ కళాశాలకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు 1
1/2

డీకేడబ్ల్యూ కళాశాలకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు

డీకేడబ్ల్యూ కళాశాలకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు 2
2/2

డీకేడబ్ల్యూ కళాశాలకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement