
వెల్లువెత్తిన అర్జీలు
అర్జీలను స్వీకరిస్తున్న కలెక్టర్ ఆనంద్
నెల్లూరు రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీదారులు పోటెత్తారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో అధికారులకు అర్జీలను అందజేసి తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. వీటిని కలెక్టర్ ఆనంద్, డీఆర్వో ఉదయభాస్కర్‌రావు, డ్వామా పీడీ గంగా భవానీ, డీపీఓ శ్రీధర్‌రెడ్డి, జెడ్పీ డిప్యూటీ సీఈఒ మోహన్‌రావు తదితరులు స్వీకరించారు. కాగా వివిధ సమస్యలపై మొత్తం 303 అర్జీలు అందాయి.
మెడికల్ వేస్ట్ సేకరణకు అనుమతించాలి
గ్రామీణ ప్రాంతాల్లో బయో మెడికల్ వేస్ట్‌ను సేకరించే కార్మికుల్లేకపోవడంతో దాన్ని ఇష్టమొచ్చినట్లు పారేస్తున్నారని ఏవీఐ బయోకేర్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. వీటిని సేకరించే అవకాశాన్ని తమకు ఇవ్వాలని కోరారు. జిల్లా వైద్య శాఖ సూచన మేరకు పర్యావరణాన్ని పరిరక్షించేందుకు కృషి చేస్తామన్నారు. కోటేశ్వరరావు, రాజేష్, శీను తదితరులు పాల్గొన్నారు.