
మా బతుకుదెరువు పోతుంది
కావలి: బీపీసీఎల్‌కు భూమిలిచ్చేది లేదని గుమ్మడి బొందల గ్రామస్తులు తెగేసి చెప్పారు. సీపీఎం, వ్యవసాయ కార్మిక సంఘం నేతలు కావలి రూరల్ మండలం రుద్రకోట పంచాయతీలోని ఆ గ్రామంలో రైతులు, స్థానికులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. బీపీసీఎల్ ఆయిల్ కంపెనీకి గ్రామంలోని పొలాలు పూర్తిగా అప్పగించాలని అధికారులు చేస్తున్న కుట్రలపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రామాయపట్నం పోర్టు అనుసంధానంగా ఏర్పాటు చేయబోతున్న ఆయిల్ కంపెనీకి పొలాలను అప్పగిస్తే, తమ బతుకుదెరువు ఏమైపోవాలని, ఎలా బతకాలని ప్రశ్నించారు. పొలాలు పోతే కల్లుగీత వృత్తి కనుమరుగైపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే పశువులు మేతకు తిరిగేదానికి కూడా అవకాశం లేకుండా పోతుందన్నారు. ప్రభుత్వం భూసేకరణను రద్దు చేసుకోవాలని, లేకపోతే పూర్తి స్థాయిలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం సీనియర్ నాయకుడు తాళ్లూరు మాల్యాద్రి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు మారుపూడి రాధాకృష్ణయ్య, వలపర్ల వెంకయ్య, తుళ్లూరు వెంకయ్య, రామకృష్ణ, జమ్ముల శివశంకర్‌రావు, వెంకటస్వామి, ఉప్పాల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
బీపీసీఎల్‌కు భూములివ్వం
గుమ్మడిబొందల గ్రామస్తుల అల్టిమేటం
నిమ్మ ధరలు (కిలో)
పెద్దవి : రూ.90
సన్నవి : రూ.60
పండ్లు : రూ.40

మా బతుకుదెరువు పోతుంది