
నమ్మక ద్రోహంపై... గర్జన గళమై..
విద్యార్థులను చదువుకు దూరం చేసే కుట్ర
ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతిదీవెన విడుదల చేయకుండా విద్యార్థులకు, ఉద్యోగాలు కల్పించకుండా కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు నమ్మకం ద్రోహం చేసింది. నిరుద్యోగ భృతి ఇస్తామంటూ నయవంచనకు పాల్పడింది. తమ భవిష్యత్‌ను కాలరాస్తున్న కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో సహా పెకలిస్తామంటూ యువత గర్జించింది. సర్కార్ మెడలు వంచి హామీలు అమలయ్యే వరకు విశ్రమించబోమని శపథం చేశారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం జిల్లా కేంద్రంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కోరుతూ యువత పోరు కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో వీఆర్‌సీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు మండు టెండను సైతం లెక్క చేయకుండా భారీ ర్యాలీ నిర్వహించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన విడుదల చేయాలని, ఉద్యోగాలు కల్పించాలని, లేదంటే నిరుద్యోగ భృతి ఇవ్వాలంటూ నినాదాలు మార్మోగాయి. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ ఎ. ఆనంద్‌కు మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జిలతో కలిసి వినతిపత్రం అందజేశారు. – నెల్లూరు (అర్బన్)
– కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి
● వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో
కదం తొక్కిన యువత
● ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉద్యోగాలు కల్పించాలని నినాదాలు
● కలెక్టరేట్ వద్ద ధర్నాకు భారీగా తరలివచ్చిన విద్యార్థులు, నిరుద్యోగులు
● ప్రభుత్వ మెడలు వంచి హామీలు అమలు చేయిస్తాం
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి
కూటమి ప్రభుత్వం విద్యార్థులను, నిరుద్యోగులను నయవంచనకు గురి చేసింది. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలు రూ.7,100 కోట్లు ఉండగా బడ్జెట్‌లో కేవలం రూ.2,600 కోట్లు మాత్రమే కేటాయించారు. దీన్ని బట్టి పేద విద్యార్థులను చదువుకు దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. రూ.8,900 కోట్లతో రాష్ట్రంలో మెడికల్ కళాశాలలను జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రారంభించగా, వాటిని కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసేందుకు పూనుకోవడం దుర్మార్గ చర్య. 2024–25 ఏడాదికి తల్లికి వందనం ఇవ్వకుండా మోసం చేశారు. 2025–26 సంవత్సరానికి రూ.12 వేల కోట్లు అవసరం కాగా, బడ్జెట్‌లో కేవలం రూ.7,600 కోట్లు పెట్టి తల్లికి టోకరా పెట్టబోతున్నారు. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తామని ఊదరగొట్టిన చంద్రబాబు ఒక్క ఉద్యోగం కల్పించలేదు. నిరుద్యోగ భృతి రెండేళ్లకు కలిపి రూ.72,000 కోట్లు అవసరం కాగా బడ్జెట్‌లో ఆ ఊసే లేదు. ప్రజలను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీస్తున్నారు. పోరాటాలతో ప్రభుత్వ మెడలు వంచి తీరుతాం.
నిరుద్యోగులకు శాపం చంద్రబాబు
– పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ
రాష్ట్రంలో 2 లక్షల మంది వలంటీర్లను తొలగించిన ఘనుడు చంద్రబాబు. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగిస్తూ యువతను నడిరోడ్డులో నిలబెడుతున్నాడు. ఎన్నికల సందర్భంగా 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ అని చెప్పాడు. గెలిచాక 16 వేల పోస్టులతో డీఎస్సీ అంటూ తొలి సంతకం చేశాడు. ఆ తొలి సంతకానికి నేటికీ దిక్కులేదు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి తల్లికి వందనం అని చెప్పి బాబు మోసం చేశారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేద విద్యార్దులకు అండగా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ పెట్టారు.
మనస్సు లేని పాలన
బాబుది
– మేరిగ మురళీధర్, ఎమ్మెల్సీ
బాబుది మోసపూరిత పాలన
– బుర్రా మధుసూదన్‌యాదవ్,
మాజీ ఎమ్మెల్యే, కందుకూరు ఇన్‌చార్జి

నమ్మక ద్రోహంపై... గర్జన గళమై..

నమ్మక ద్రోహంపై... గర్జన గళమై..

నమ్మక ద్రోహంపై... గర్జన గళమై..

నమ్మక ద్రోహంపై... గర్జన గళమై..