
పవన్ కుమార్ మృతదేహం
మనుబోలు: మండలంలోని వీరంపల్లి గ్రామంలో వినాయక చవితి వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌తో ఓ వ్యక్తి మృతిచెందాడు. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు.. వినాయక చవితి సందర్భంగా గ్రామంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసి రోజూ పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి నలగర్ల పవన్ కుమార్ (30) అనే వ్యక్తి ప్రసాదాలు తీసుకోవాలని మైక్‌లో చెబుతున్నాడు. ఈ సమయంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. పవన్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు గురువారం తెలిపారు.