
ఆసక్తికరంగా సాగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 138 ఆలౌట్
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ 144/8
ఓవరాల్‌గా 218 పరుగుల ఆధిక్యం
వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ రెండో రోజు ముగిసేసరికే ఉత్కంఠభరిత స్థితికి చేరింది. గురువారం కూడా పేసర్ల జోరు కొనసాగడంతో తొలి రోజులాగే మొత్తం 14 వికెట్లు నేలకూలాయి. ముందుగా కమిన్స్ ధాటికి దక్షిణాఫ్రికా తడబడి ఆధిక్యం కోల్పోగా... ఆ తర్వాత రబాడ, ఇన్‌గిడి దెబ్బకు ఆసీస్ బ్యాటర్లు కూడాచేతులెత్తేశారు. అయితే ఇప్పటికే ఆధిక్యం 200 దాటిన ఆ్రస్టేలియాదే కాస్త పైచేయిగా కనిపిస్తుండగా... చివరి రోజు సఫారీ టీమ్ ముందు ఎంతటి లక్ష్యం ఉంటుందనేది ఆసక్తికరం.
లండన్: ఆ్రస్టేలియా డబ్ల్యూటీసీ ట్రోఫీని నిలబెట్టుకుంటుందా... దక్షిణాఫ్రికా 27 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ గెలుచుకుంటుందా అనేది శుక్రవారమే తేలే అవకాశం ఉంది. బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శిస్తున్న ఫైనల్లో మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. అలెక్స్ కేరీ (50 బంతుల్లో 43; 5 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడగా... ప్రస్తుతం ఆసీస్ ఓవరాల్ ఆధిక్యం 218 పరుగులకు చేరింది.
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 43/4తో ఆటను కొనసాగించిన దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 57.1 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఆ్రస్టేలియాకు 74 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. బెడింగ్‌హామ్ (45; 6 ఫోర్లు), బవుమా (36; 4 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. కమిన్స్ (6/28) ఆరు వికెట్ల ప్రదర్శనతో చెలరేగాడు.
12 పరుగులకు 5 వికెట్లు...
రెండో రోజు బవుమా, బెడింగ్‌హామ్ భాగస్వామ్యంతో జట్టు పరిస్థితి మెరుగ్గా కనిపించింది. లబుషిషేన్ అద్భుత క్యాచ్‌కు బవుమా వెనుదిరగడంతో ఈ భాగస్వామ్యానికి తెర పడింది. బవుమా, బెడింగ్‌హామ్ ఐదో వికెట్‌కు 64 పరుగులు జోడించారు. ఆ తర్వాత బెడింగ్‌హామ్ కొద్దిసేపు పోరాడాడు. అయితే లంచ్ తర్వాత కమిన్స్ ధాటికి దక్షిణాఫ్రికా ఒక్కసారిగా కుప్పకూలింది.
126/5తో ఉన్న జట్టు 12 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయింది. ఒకే ఓవర్లో వెరీన్ (13), యాన్సెన్ (0)లను అవుట్ చేసిన కమిన్స్... బెడింగ్‌హామ్‌నూ పెవిలియన్‌కు పంపించి ఐదు వికెట్ల ప్రదర్శనను పూర్తి చేసుకున్నాడు. కేశవ్ మహరాజ్ (7) రనౌట్ కాగా, రబాడ (1) వికెట్‌తో సఫారీల ఇన్నింగ్స్ ముగిసింది.
టపటపా...
తొలి ఇన్నింగ్స్‌కంటే మెరుగైన ప్రదర్శనతో ప్రత్యర్థికి సవాల్ విసరాల్సిన ఆ్రస్టేలియా బ్యాటింగ్ రెండో ఇన్నింగ్స్‌లో మరింత పేలవంగా సాగింది. ఓపెనర్లు లబుషేన్ (22), ఖ్వాజా (6) తొలి 10 ఓవర్ల పాటు జాగ్రత్తగా ఆడారు. దాంతో ఆసీస్‌కు సరైన ఆరంభం లభించినట్లు అనిపించింది. అయితే ఆ తర్వాత అనూహ్యంగా జట్టు పతనం మొదలైంది.
ఒకే ఓవర్లో ఖ్వాజా, గ్రీన్ (0) లను రబాడ పెవిలియన్ పంపించగా, యాన్సెన్ చక్కటి బంతితో లబుషేన్‌ను అవుట్ చేశాడు. స్మిత్ (13) ఇన్‌గిడి బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్ నాటౌట్ ఇవ్వగా... ‘రివ్యూ’ లో దక్షిణాఫ్రికా ఫలితం సాధించింది. వెబ్‌స్టర్ (9), హెడ్ (9), కమిన్స్ (6) కేవలం 7 పరుగుల వ్యవధిలో వెనుదిరిగారు. కేరీ, స్టార్క్ (16 బ్యాటింగ్) 8వ వికెట్ కు 61 పరుగులు జోడించి జట్టు ను ఆదుకున్నారు. దాంతో ఆసీస్ ఓవరాల్ ఆధిక్యం 200 దాటింది.
‘హ్యాండిల్డ్ ద బాల్’ వివాదం
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. వెబ్‌స్టర్ వేసిన 49వ ఓవర్లో బెడింగ్‌హామ్ బ్యాట్‌ను తాకిన బంతి అతని కాలి ప్యాడ్ ఫ్లాప్‌లోకి వెళ్లింది. అది కింద పడే లోపు క్యాచ్ అందుకునేందుకు ఆసీస్ కీపర్ కేరీ ప్రయత్నించాడు. అయితే అదే సమయంలో బెడింగ్‌హామ్ తన చేత్తో బంతిని తీసి కింద విసిరేశాడు. దీనిపై స్మిత్, ఖ్వాజా ‘హ్యాండిల్డ్ ద బాల్’ గురించి అప్పీల్ చేశారు.
దీనిపై ఫీల్డ్ అంపైర్లు గాఫ్‌నీ, ఇల్లింగ్‌వర్త్ చర్చించి అప్పటికే ‘డెడ్‌బాల్’ అయిందని ప్రకటిస్తూ నాటౌట్‌గా తేల్చారు. అయితే రీప్లేలు చూస్తే బంతి ప్యాడ్‌లో ఇరుక్కుపోకుండా ఇంకా ‘రోలింగ్’లోనే ఉండటం కనిపించింది. అది స్పష్టంగా అవుట్ అని, మూడో అంపైర్‌ను సంప్రదించకుండా ఫీల్డ్ అంపైర్లు వేగంగా నిర్ణయం వెలువరించారని దీనిపై తీవ్ర చర్చ సాగింది.
300 టెస్టుల్లో ప్యాట్ కమిన్స్ వికెట్ల సంఖ్య. ఈ ఘనత సాధించిన ఎనిమిదో ఆ్రస్టేలియా బౌలర్‌గా నిలిచిన కమిన్స్ 68 టెస్టుల్లో ఈ మైలురాయిని చేరాడు.
స్కోరు వివరాలు
ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: 212; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: మార్క్‌రమ్ (బి) స్టార్క్ 0; రికెల్టన్ (సి) ఖ్వాజా (బి) స్టార్క్ 16; ముల్డర్ (బి) కమిన్స్ 6; బవుమా (సి) లబుషేన్ (బి) కమిన్స్ 36; స్టబ్స్ (బి) హాజల్‌వుడ్ 2; బెడింగ్‌హామ్ (సి) కేరీ (బి) కమిన్స్ 45; వెరీన్ (ఎల్బీ) (బి) కమిన్స్ 13; యాన్సెన్ (సి అండ్ బి) కమిన్స్ 0; మహరాజ్ (రనౌట్) 7; రబాడ (సి) వెబ్‌స్టర్ (బి) కమిన్స్ 1; ఇన్‌గిడి (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (57.1 ఓవర్లలో ఆలౌట్) 138. వికెట్ల పతనం: 1–0, 2–19, 3–25, 4–30, 5–94, 6–126, 7–126, 8–135, 9–138, 10–138. బౌలింగ్: స్టార్క్ 13–3–41–2, హాజల్‌వుడ్ 15–5–27–1, కమిన్స్ 18.1–6–28–6, లయన్ 8–3–12–0, వెబ్‌స్టర్ 3–0–20–0.
ఆ్రస్టేలియా రెండో ఇన్నింగ్స్: లబుషేన్ (సి) వెరీన్ (బి) యాన్సెన్ 22; ఖ్వాజా (సి) వెరీన్ (బి) రబాడ 6; గ్రీన్ (సి) ముల్డర్ (బి) రబాడ 0; స్మిత్ (ఎల్బీ) (బి) ఇన్‌గిడి 13; హెడ్ (బి) ముల్డర్ 9; వెబ్‌స్టర్ (ఎల్బీ) (బి) ఇన్‌గిడి 9; కేరీ (ఎల్బీ) (బి) రబాడ 43; కమిన్స్ (బి) ఇన్‌గిడి 6; స్టార్క్ (బ్యాటింగ్) 16; లయన్ (బ్యాటింగ్) 1; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (40 ఓవర్లలో 8 వికెట్లకు) 144. వికెట్ల పతనం: 1–28, 2–28, 3–44, 4–48, 5–64, 6–66, 7–73, 8–134. బౌలింగ్: రబాడ 11–0–44–3, యాన్సెన్ 12–3–31–1, ముల్డర్ 6–0–14–1, ఇన్‌గిడి 9–0–35–3, మహరాజ్ 2–0–10–0.