T20 WC: వెస్టిండీస్‌పై టీమిండియా ఘన విజయం

Womens T20 WC 2023: India Women Vs West Indies Women Match Live Updates - Sakshi

వెస్టిండీస్‌పై టీమిండియా ఘన విజయం
మహిళల టి20 ప్రపంచకప్‌లో టీమిండియా మరో విజయం నమోదు చేసింది. బుధవారం గ్రూప్‌-బిలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 119 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మరో 11 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్‌ను అందుకుంది. రిచా ఘోష్‌ 44 నాటౌట్‌, కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్ (33) జట్టునువ విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో భారత మహిళల జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేయగా.. విండీస్‌కు ఇది రెండో పరాజయం.

అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ వుమెన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. నాలుగు పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయిన విండీస్‌ ఆ తర్వాత క్యాంప్‌బెల్లె(30 పరుగులు), స్టెఫానీ టేలర్‌(42 పరుగులు).. రెండో వికెట్‌కు 73 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరు ఔట్‌ కావడం విండీస్‌ కష్టాలు పెంచింది. ఆ తర్వాత భారత బౌలర్లు సమర్థంగా బౌలింగ్‌ చేయడంతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పో‍తూ పరుగులు చేయలేకపోయింది. దీప్తి శర్మ మూడు వికెట్లు తీయగా రేణుకా సింగ్‌, పూజా వస్త్రాకర్‌ చెరొక వికెట్‌ తీశారు.

నిలకడగా ఆడుతున్న టీమిండియా
► సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిలకడగా ఆడుతుంది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(30 పరుగులు), రిచా ఘోష్‌(22 పరుగులు) ఇన్నింగ్స్‌ను నడిపిస్తున్నారు. ప్రస్తుతం భారత్‌ మూడు వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 22 పరుగులు కావాల్సి ఉంది.

8 ఓవర్లలో టీమిండియా స్కోరు 44/3
► 119 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా వుమెన్స్‌ 8 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది. స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన కేవలం 10 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌ చేరగా.. జెమీమా రోడ్రిగ్స్‌ ఒక్క పరుగుకే వెనుదిరిగింది. ఆ తర్వాత కాసేపటికే షఫాలీ వర్మ(28 పరుగులు) మూడో వికెట్‌గా వెనుదిరిగింది.

టీమిండియా వుమెన్స్‌ టార్గెట్‌ 119 పరుగులు
► టీమిండియా వుమెన్స్‌తో మ్యాచ్‌లో వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 118 పరుగులు మాత్రమే చేయగలిగింది. నాలుగు పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయిన విండీస్‌ ఆ తర్వాత క్యాంప్‌బెల్లె(30 పరుగులు), స్టెఫానీ టేలర్‌(42 పరుగులు).. రెండో వికెట్‌కు 73 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరు ఔట్‌ కావడం విండీస్‌ కష్టాలు పెంచింది. ఆ తర్వాత భారత బౌలర్లు సమర్థంగా బౌలింగ్‌ చేయడంతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పో‍తూ పరుగులు చేయలేకపోయింది. దీప్తి శర్మ మూడు వికెట్లు తీయగా రేణుకా సింగ్‌, పూజా వస్త్రాకర్‌ చెరొక వికెట్‌ తీశారు.

నాలుగో వికెట్‌ కోల్పోయిన విండీస్‌
► చినెలి హెన్రీ(2) రనౌట్‌ కావడంతో విండీస్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం విండీస్‌ 17 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది.

వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన విండీస్‌
► ఒక్క ఓవర్‌లోనే వెస్టిండీస్‌ రెండు వికెట్లను కోల్పోయింది. దీప్తి శర్మ వేసిన ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌లో తొలుత 30 పరుగులు చేసిన క్యాంప్‌బెల్లె స్మృతి మంధాన అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగింది. ఆ తర్వాత ఓవర్‌ చివరి బంతికి 42 పరుగులు చేసిన టేలర్‌ ఎల్బీగా వెనుదిరిగింది. దీంతో వెస్టిండీస్‌ 78 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది.

10 ఓవర్లలో వెస్టిండీస్‌ 53/1
► తొలి వికెట్‌ ఆరంభంలోనే కోల్పోయినప్పటికి వెస్టిండీస్‌ తన ఇన్నింగ్స్‌ను నిలకడగా కొనసాగుతుంది. 10 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టానికి 53 పరుగులు చేసింది. స్టెఫాని టేలర్‌ 28, క్యాంప్‌బెల్లె 21 పరుగులతో క్రీజులో ఉన్నారు.

4 ఓవర్లలో విండీస్‌ స్కోరు 15/1
► 4 ఓవర్లు ముగిసేసరికి వెస్టిండీస్‌ వికెట్‌ నష్టానికి 15 పరుగులు చేసిది. టేలర్‌ 3, క్యాంప్‌బెల్లే 8 పరుగులతో క్రీజులో ఉన్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన విండీస్‌
► వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో పూజా వస్త్రాకర్‌ టీమిండియాకు శుభారంభాన్ని ఇచ్చింది. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ తొలి బంతికే కెప్టెన్‌ హేలీ మాథ్యూస్‌ను క్యాచ్‌ ఔట్‌గా పెవిలియన్‌ చేర్చింది. విండీస్‌ జట్టు ప్రస్తుతం వికెట్‌ నష్టానికి నాలుగు పరుగులు చేసింది.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఏంచుకున్న వెస్టిండీస్‌ వుమెన్స్‌
► మహిళల టి20 వరల్డ్‌కప్‌లో భాగంగా గ్రూప్‌-బిలో ఇవాళ ఇండియా వుమెన్స్‌, వెస్టిండీస్‌ వుమెన్స్‌ మధ్య మ్యాచ్‌ మొదలైంది. టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ మహిళల జట్టు బ్యాటింగ్‌ ఏంచుకుంది. ఇప్పటి వరకు భారత్, వెస్టిండీస్‌ జట్ల మధ్య 20 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు జరిగాయి. భారత్‌ 12 మ్యాచ్‌ల్లో, వెస్టిండీస్‌ 8 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ఇక టి20 ప్రపంచకప్‌ చరిత్రలో రెండు జట్లు రెండుసార్లు తలపడగా...ఇరు జట్లకు ఒక్కో మ్యాచ్‌లో విజయం దక్కింది.   

భారత మహిళల తుదిజట్టు: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), రిచా ఘోష్ (వికెట్‌ కీపర్‌), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, దేవికా వైద్య, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా ఠాకూర్ సింగ్

వెస్టిండీస్ మహిళల తుదిజట్టు: హేలీ మాథ్యూస్ (కెప్టెన్‌), స్టాఫానీ టేలర్, షెమైన్ కాంప్‌బెల్లె, షబికా గజ్నాబి, చినెల్లే హెన్రీ, చెడియన్ నేషన్, అఫీ ఫ్లెచర్, షామిలియా కన్నెల్, రషదా విలియమ్స్ (వికెట్‌ కీపర్‌), కరిష్మా రామ్‌హారక్, షకేరా సెల్మాన్

తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను మట్టికరిపించిన భారత్‌.. వెస్టీండీస్‌తో మ్యాచ్‌లో అదే రిపీట్‌ చేయాలని భావిస్తోంది. మరోవైపు ఇంగ్లండ్‌ వుమెన్స్‌తో మ్యాచ్‌లో విండీస్‌ ఓటమిపాలైంది. ఇక పాక్‌తో మ్యాచ్‌కు వేలిగాయంతో దూరమైన స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన విండీస్‌తో మ్యాచ్‌కు తిరిగిరావడం బ్యాటింగ్‌ బలాన్ని మరింత పెంచింది. 

గత జనవరిలో జరిగిన ముక్కోణపు సిరీస్‌లో భారత జట్టు వెస్టిండీస్‌తో తలపడిన రెండుసార్లు విజయం సాధించింది. ఓపెనింగ్‌లో షఫాలీ వర్మ, వన్‌డౌన్‌ బ్యాటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ ఫామ్‌లో ఉండటంతో భారత టాపార్డర్‌కు ఏ ఢోకా లేదు. మిడిలార్డర్‌లో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్, రిచా ఘోష్‌లు కూడా బ్యాట్‌ ఝుళిపించగలరు. దీంతో భారీస్కోర్లు సాధించే సత్తా మన జట్టుకుంది. బౌలింగ్‌లో రేణుక సింగ్‌ తన పదును చూపాల్సి ఉంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top