క్రిచికోవా X జాస్మిన్‌... నేడు వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్‌ | Wimbledon womens singles final today | Sakshi
Sakshi News home page

క్రిచికోవా X జాస్మిన్‌... నేడు వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్‌

Jul 13 2024 4:01 AM | Updated on Jul 13 2024 11:02 AM

Wimbledon womens singles final today

ఈ ఏడాది వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో కొత్త విజేత అవతరించనుంది. లండన్‌ లో ఈరోజు జరిగే ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్‌ జాస్మిన్‌ పావోలిని (ఇటలీ)తో ప్రపంచ 32వ ర్యాంకర్‌ క్రిచికోవా (చెక్‌ రిపబ్లిక్‌) తలపడుతుంది. వీరిద్దరు తొలిసారి వింబుల్డన్‌ టోర్నీలో ఫైనల్‌కు చేరుకున్నారు. 

28 ఏళ్ల క్రిచికోవా 2021లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌ నెగ్గగా... 28 ఏళ్ల జాస్మిన్‌ గత నెలలో ఫ్రెంచ్‌ ఓపెన్‌ లో రన్నరప్‌గా నిలిచింది. ఈ ఏడాది వింబుల్డన్‌ సింగిల్స్‌ చాంపియన్‌కు 27 లక్షల పౌండ్లు (రూ. 29 కోట్ల 23 లక్షలు)... రన్నరప్‌కు 14 లక్షల పౌండ్లు (రూ. 15 కోట్ల 15 లక్షలు) ప్రైజ్‌మనీగా లభిస్తాయి. సాయంత్రం 6 గంటలకు మొదలయ్యే ఫైనల్‌ మ్యాచ్‌ను స్టార్‌ స్పోర్ట్స్‌–2లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement