
భారత్, పాకిస్తాన్ మధ్య యుద్దం సమసిపోయాక ఐపీఎల్ 2025 పునఃప్రారంభ తేదీని ప్రకటించారు. మే 17 నుంచి క్యాష్ రిచ్ లీగ్ కొన్ని మార్పులతో కొనసాగుతుంది. మే 8న రద్దైన పంజాబ్, ఢిల్లీ మ్యాచ్ మే 24కు షెడ్యూల్ కాగా.. కొన్ని మ్యాచ్‌ల వేదికల్లో మార్పులు జరిగాయి. లీగ్ మ్యాచ్‌ల వేదికలను ఖరారు చేసిన బీసీసీఐ.. ప్లే ఆఫ్స్ వేదికలను ప్రకటించాల్సి ఉంది. వారం వాయిదా అనంతరం క్యాష్ రిచ్ లీగ్ జూన్ 3న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది.
ఇదిలా ఉంటే, భారత్, పాక్ మధ్య యుద్దం నేపథ్యంలో ఐపీఎల్ 2025లో ఆడే విదేశీ ప్లేయర్లంతా స్వదేశాలకు వెళ్లిపోయారు. లీగ్ పునఃప్రారంభం కానుండటంతో వారు తదుపరి మ్యాచ్‌లకు అందుబాటులోకి వస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. చాలా మంది క్రికెటర్లు ఐపీఎల్‌లో తిరిగి పాల్గొనేందుకు సంసిద్దత వ్యక్తం చేయగా.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికాకు చెందిన క్రికెటర్లు ఇంకా డైలమాలో ఉన్నారు.
ఐపీఎల్ తదుపరి మ్యాచ్‌లు జరుగబోయే తేదీల్లో ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్ల మధ్య వన్డే సిరీస్ షెడ్యూలై ఉంది. మే 29, జూన్ 1, 3 తేదీల్లో ఇరు జట్లు మూడు వన్డేలు ఆడనున్నాయి. ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లలో ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతున్న ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు.
ఇంగ్లండ్ ఆటగాళ్లలో జోస్ బట్లర్ (గుజరాత్), విల్ జాక్స్ (ముంబై), జేకబ్ బేతెల్ (ఆర్సీబీ), జోఫ్రా ఆర్చర్ (రాజస్థాన్), జేమీ ఓవర్టన్ (సీఎస్‌కే).. వెస్టిండీస్ ఆటగాళ్లలో ఫెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (గుజరాత్), రొమారియో షెపర్డ్ (ఆర్సీబీ), షమార్ జోసఫ్ (లక్నో) వేర్వేరు జట్ల తరఫున ఐపీఎల్‌లో ఆడుతున్నారు. ఐపీఎల్ తేదీలతో ఇంగ్లండ్, విండీస్ వన్డే సిరీస్ క్లాష్ కావడంతో వీరంతా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు.
మరోవైపు ఐపీఎల్ ఫైనల్ ముగిసిన వారం రోజుల్లోనే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్ల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరగాల్సి ఉంది. ఈ కీలక మ్యాచ్ కోసం ఇరు జట్లను ఇవాళే ప్రకటించారు. ఇరు జట్లలో మొత్తం 13 మంది ఆటగాళ్లు ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో పాల్గొంటున్నారు. ఐపీఎల్ తర్వాత వారం రోజుల వ్యవధే ఉండటంతో వీరు ఏ నిర్ణయం తీసుకుంటారో అని అంతా ఎదురుచూస్తున్నారు. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఐపీఎల్‌లో పాల్గొనే విషయాన్ని ఆటగాళ్లకే వదిలేయగా.. క్రికెట్ సౌతాఫ్రికా ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఆసీస్ ఆటగాళ్లు..
పాట్ కమిన్స్ (ఎస్‌ఆర్‌హెచ్)
ట్రవిస్ హెడ్ (ఎస్‌ఆర్‌హెచ్)
జోష్ హాజిల్‌వుడ్ (ఆర్సీబీ)
జోస్ ఇంగ్లిస్ (పంజాబ్)
మిచెల్ స్టార్క్ (ఢిల్లీ)
సౌతాఫ్రికా ఆటగాళ్లు..
మార్క్రమ్ (లక్నో)
ఎంగిడి (ఆర్సీబీ)
స్టబ్స్ (ఢిల్లీ)
కార్బిన్ బాష్ (ముంబై ఇండియన్స్)
ర్యాన్ రికెల్టన్ (ముంబై ఇండియన్స్)
జన్సెన్ (పంజాబ్)
రబాడ (గుజరాత్)
ముల్దర్ (ఎస్‌ఆర్‌హెచ్)
పైన పేర్కొన్న ఆటగాళ్లలో కొందరు ప్లే ఆఫ్స్‌కు చేరుకునే అవకాశం లేని జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరి నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు. ప్లే ఆఫ్స్ రేసులో ముందున్న జట్లకు (గుజరాత్, ఆర్సీబీ, పంజాబ్, ముంబై, ఢిల్లీ) ప్రాతినిథ్యం వహిస్తున్న ఆటగాళ్లతో సమస్య వస్తుంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపిక చేసిన సౌతాఫ్రికా జట్టులో ఏకంగా ఎడుగురు ఆటగాళ్లు ప్లే ఆఫ్స్ రేసులో ముందున్న జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరంతా దేశమా.. ఐపీఎలా అని తలలు బాదుకుంటున్నారు.
ఐపీఎల్ 2025లో ఆడుతున్న విదేశీ ఆటగాళ్ల జాబితా..
RCB: టిమ్ డేవిడ్, ఫిల్ సాల్ట్, జేకబ్ బేతెల్, లియామ్ లివింగ్‌స్టోన్, రొమారియో షెపర్డ్, జోష్ హాజిల్‌వుడ్, లుంగి ఎంగిడి, నువాన్ తుషార,
CSK: డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, సామ్ కర్రన్, డెవాల్డ్ బ్రెవిస్, జేమీ ఓవర్టన్, నాథన్ ఎల్లిస్, నూర్ అహ్మద్, మతీష పతిరణ
PBKS: జోష్ ఇంగ్లిస్, మిచెల్ ఓవెన్, ఆరోన్ హార్డీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జన్సెన్, మార్కస్ స్టోయినిస్, జేవియర్ బార్ట్‌లెట్
KKR: ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, క్వింటన్ డి కాక్, రోవ్‌మన్ పావెల్, రహ్మానుల్లా గుర్బాజ్, మోయిన్ అలీ, స్పెన్సర్ జాన్సన్, అన్రిచ్ నోర్ట్జే
SRH: ట్రావిస్ హెడ్, పాట్ కమ్మిన్స్, హెన్రిచ్ క్లాసెన్, కమిండు మెండిస్, వియాన్ ముల్డర్, ఎషాన్ మలింగ
GT: జోస్ బట్లర్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రషీద్ ఖాన్, కరీం జనత్, దాసున్ షనక, గెరాల్డ్ కోయెట్జీ, కగిసో రబడ
DC: ఫాఫ్ డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, సెదిఖుల్లా అటల్, ట్రిస్టన్ స్టబ్స్, డొనొవన్ ఫెరియెరా, దుష్మంత చమీరా, మిచెల్ స్టార్క్
MI: బెవాన్ జాకబ్స్, విల్ జాక్స్, మిచెల్ సాంట్నర్, కార్బిన్ బాష్, ర్యాన్ రికెల్టన్, రీస్ టాప్లే, ట్రెంట్ బౌల్ట్, ముజీబ్ రెహ్మాన్
LSG: ఎయిడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, మిచెల్ మార్ష్, మాథ్యూ బ్రీట్జ్కీ, నికోలస్ పూరన్, షమార్ జోసఫ్
RR: షిమ్రోన్ హెట్‌మైర్, వనిందు హసరంగ, డ్రి ప్రిటోరియస్, మహీశ్ తీక్షణ, క్వేనా మఫాకా, ఫజల్‌హక్ ఫారూకీ, జోఫ్రా ఆర్చర్, నండ్రే బర్గర్