ట్యునీషియాపై విజ‌యం.. సంబ‌రాలు చేసుకోని స్వీడ‌న్‌! | Why Sweden Yasin Ayari Not Celebrate Match Wining Vs Tunisia In FIFA World Cup 2026, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

ట్యునీషియాపై విజ‌యం.. సంబ‌రాలు చేసుకోని స్వీడ‌న్‌!

Jun 15 2026 12:22 PM | Updated on Jun 15 2026 2:14 PM

Why-Sweden-Yasin Ayari Not-Celebrate-Match Wining Vs Tunisia-FIFA-WC 2026

ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ 2026లో స్వీడ‌న్ శుభారంభం చేసింది. గ్రూప్‌-ఎఫ్‌లో భాగంగా సోమ‌వారం స్వీడ‌న్ 5-1 తేడాతో ట్యునీషియాతోను చిత్తు చేసింది. 22 ఏళ్ల మిడ్‌ఫీల్డ‌ర్ యాసిన్ అయారి సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచి జ‌ట్టు విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించాడు. ఆట ప్రారంభ‌మైన ఏడు నిమిషాల‌కే యాసిన్ అయారి గోల్ కొట్టి స్వీడన్‌కు ఆధిక్యం ఇచ్చాడు. 

ఆ త‌ర్వాత ఆట 30వ నిమిషంలో అలెగ్జాండ‌ర్ ఐసాక్ గోల్ కొట్ట‌డంతో స్వీడన్ 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే ట్యునీషియా ఆట‌గాడు ఒమ‌ర్ రెకిక్ ఆట 43వ నిమిషంలో గోల్ కొట్టడంతో ట్యునీషియా ఖాతా తెరిచింది. అయితే రెండో హాఫ్‌లో ప‌దే ప‌దే ట్యునీషియా గోల్ పోస్టుపై స్వీడ‌న్ దాడులు చేసింది. 

ఈ క్ర‌మంలో విక్టోర్ (ఆట 59వ నిమిషం), మాట్టియ‌స్ (ఆట 84వ నిమిషం)లో గోల్స్ కొట్ట‌డంతో స్వీడ‌న్ 4-1తో మ‌రింత ఆధిక్యంలోకి వెళ్లిపోయింది. మ‌రో ఆరు నిమిషాల్లో ఆట ముగుస్తుంద‌న‌గా యాసిన్ అయారి మ‌రో గోల్ కొట్టి స్వీడ‌న్‌కు 5-1తో మ‌రిచిపోలేని విజ‌యాన్ని అందించాడు.

సంబ‌రాలకు దూరంగా యాసిన్‌
స్వీడ‌న్ మ్యాచ్ గెలిచిన‌ప్ప‌టికీ ఆ జ‌ట్టు మిడ్‌ఫీల్డ‌ర్ యాసిన్ అయారి సంబ‌రాలకు దూరంగా ఉండిపోవ‌డం వెనుక బ‌ల‌మైన కార‌ణ‌ముంది. అదేంటంటే యాసిన్ అయారికి ట్యునీషియాతో మంచి సంబంధాలున్నాయి. యాసిన్ స్వీడ‌న్ దేశ‌స్తుడైన‌ప్ప‌టికీ అత‌డి తండ్రి మాత్రం ట్యునీషియాలోనే పుట్టి పెరిగాడు. 

తండ్రికి చెందిన‌ దేశంపై గెలిచినందునే తాను సెల‌బ్రేష‌న్స్‌కు దూరంగా ఉన్న‌ట్లు  యాసిన్ అయారి మ్యాచ్ ముగిసిన అనంత‌రం వెల్ల‌డించాడు. 2023లో స్వీడ‌న్ జాతీయ ఫుట్‌బాల్ జ‌ట్టుకు ఎంపికైన యాసిన్ అయారి అప్ప‌టినుంచి జ‌ట్టు త‌ర‌ఫున సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు క‌న‌బ‌రుస్తూ కీల‌క ఆట‌గాడిగా మారిపోయాడు.

చదవండి: హోల్డర్ సిక్సర్ల వర్షం.. సిరీస్ కైవసం చేసుకున్న విండీస్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement