IPL 2023 Mini Auction: Who is Mukesh Kumar Sold To Delhi Capitals For Rs 5.5 Crores - Sakshi
Sakshi News home page

IPL 2023 Auction-Mukesh Kumar: అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌కు రూ.5.5 కోట్లు.. ఎవరీ ముఖేష్‌ కుమార్‌?

Dec 23 2022 6:44 PM | Updated on Dec 23 2022 9:37 PM

Who is Mukesh Kumar Sold For Delhi Capitals Rs 5-5 Cr IPL Mini Auction - Sakshi

ఐపీఎల్‌ మినీ వేలంలో కొందరు అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లకు కాసుల వర్షం కురిపించింది. శివమ్‌ మావి, ముఖేష్‌ కుమార్‌ లాంటి ఆటగాళ్లకు జాక్‌పాట్‌ తగిలిందనే చెప్పొచ్చు. శివమ్‌ మావి పేరు ఐపీఎల్‌లో పాపులర్‌ అయినప్పటికి.. ముఖేష్‌ కుమార్‌ మాత్రం గత సీజన్‌ నుంచే వెలుగులోకి వచ్చాడు. గతేడాది సీఎస్‌కే తరపున ఆడిన ముఖేష్‌ కుమార్‌ రూ.20 లక్షల కనీస ధరతో బరిలోకి దిగాడు.

అతని కోసం వేలంలో సీఎస్‌కే, ఢిల్లీ క్యాపిటల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌లు పోటీపడ్డాయి.  అయితే చివరకు ముఖేష్‌ కుమార్‌ను రూ. 5.50 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్‌ సొంతం చేసుకుంది. ఒక అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌ కోసం ఇంత వెచ్చించడం ఆసక్తి కలిగించింది. అందుకే ముఖేష్‌ కుమార్‌ గురించి కొన్ని విషయాలు

ఎవరీ ముఖేష్‌ కుమార్‌?
► 28 ఏళ్ల ముఖేష్‌ కుమార్‌ కోల్‌కతాలో జన్మించాడు.
► అతడు దేశీవాళీ క్రికెట్‌లో బెంగాల్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 
► ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో ముఖేష్‌ 2015లో హర్యానా పై అరంగేట్రం చేశాడు.
► అదే విధంగా టీ20 క్రికెట్‌లో 2016లో గుజరాత్‌ డెబ్యూ చేశాడు.
► లిస్ట్‌-ఏ కెరీర్‌లో ఇప్పటివరకు 18 మ్యాచ్‌లు ఆడిన ముఖేష్‌.. 5.17 ఏకానమి రేటుతో 17 వికెట్లు పడగొట్టాడు.
► ఇక టీ20 క్రికెట్‌లో ముఖేష్‌ 17 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు సాధించాడు.
► ఇక తన ఫస్ట్‌ క్లాస్‌ కెరీర్‌లో ఇప్పటి వరకు 30 మ్యాచ్‌లు ఆడిన అతడు 109 వికెట్లు పడగొట్టాడు.
► స్వదేశంలో న్యూజిలాండ్‌-ఏతో జరిగిన నాలుగు రోజుల మ్యాచ్‌ సిరీస్‌లో ముఖేష్‌ 9 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
► అదే విధంగా 2021-22 రంజీ ట్రోఫీ సీజన్‌లో 20 వికెట్లు పడగొట్టిన ముఖేష్‌.. బెంగాల్‌ జాయింట్‌ లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు.

చదవండి: జాక్‌పాట్‌ కొట్టాడు.. అత్యధిక మొత్తం అందుకున్న తొలి వికెట్‌ కీపర్‌గా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement