PC: X
వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2026లో వెస్టిండీస్ ఛాంపియన్స్ బోణీ కొట్టింది. బుధవారం షార్జా వేదికగా ఇంగ్లండ్ ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 19.1 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది.
గత మ్యాచ్‌లో ఇండియా ఛాంపియన్స్‌పై ఇరగదీసిన కెప్టెన్ రవి బొపారా.. కరేబియన్ జట్టుపై మాత్రం డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో మొయిన్ అలీ(41) టాప్ స్కోరర్‌గా నిలవగా.. డేవిడ్ మలాన్(29), జాసన్ రాయ్(27) రాణించారు. విండీస్ బౌలర్లలో ఫిడెల్ ఎడ్వర్డ్స్, డ్వేన్ బ్రావో, రీఫర్ తలా రెండు వికెట్లు చొప్పున పడగొట్టారు.
సిమన్స్ విధ్వంసం
అనంతరం 155 పరుగుల లక్ష్య చేధనలో విండీస్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తొలి ఓవర్‌లోనే కెప్టెన్ క్రిస్ గేల్(4) వికెట్‌ను వెస్టిండీస్ కోల్పోయింది. ఆ తర్వాత లెండల్ సిమన్స్(33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 55), చాడ్విక్ వాల్టన్(35 బంతుల్లో 46) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు.
వీరితో పాటు ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రీఫర్ కూడా బ్యాట్ ఝూళిపించాడు. రీఫర్ 22 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 35 పరుగులు చేశాడు. ఫలితంగా విండీస్ జట్టు లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 16.1 ఓవర్లలో చేధించింది.
చదవండి: IND vs NZ: టీమిండియాతో వరుస సిరీస్‌లు.. న్యూజిలాండ్ కీలక నిర్ణయం


