విజయవాడ: దుర్గమ్మ కొండ కాంతులీనుతోంది. ఉత్సవ శోభతో అలరారుతోంది.
ఈ నెల 11 నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానుండటంతో సన్నద్ధమవుతోంది.
అధికారులు ఇంద్రగిరితో పాటు ఆలయ ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలతో దేదీప్యంగా అలంకరించడంతో ధగధగ మెరిసిపోతోంది.
బుధవారం రాత్రి వేళ సరికొత్తగా ఆవిష్కృతమై ఉత్సవానికి భక్తులను ఆహ్వానిస్తోంది.


