T20 WC 2023: న్యూజిలాండ్‌ మహిళా జట్టు కోచ్‌గా సౌతాఫ్రికా మాజీ పేసర్‌

WC 2023: Morne Morkel To Join New Zealand Women Coaching Staff - Sakshi

Morne Morkel: సౌతాఫ్రికా మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ మోర్నీ మోర్కెల్‌ న్యూజిలాండ్‌ కోచింగ్‌ స్టాఫ్‌లో భాగం కానున్నాడు. స్వదేశంలో జరుగనున్న మహిళా టీ20 ప్రపంచకప్‌ టోర్నీ నేపథ్యంలో వైట్‌ఫెర్న్స్‌కు బౌలింగ్‌లో మెళకువలు నేర్పించనున్నాడు. కివీస్‌ మహిళా జట్టు ఫాస్ట్‌ బౌలింగ్‌ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.

ఈ విషయాన్ని న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. కాగా 38 ఏళ్ల మోర్నీ మోర్కెల్‌ ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌ ఈవెంట్‌లో నమీబియా పురుషుల జట్టు కోచ్‌గా పనిచేశాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా టీ20 లీగ్‌తో బిజీగా ఉన్నాడు. ప్రొటిస్‌ పొట్టి లీగ్‌లో అతడు డర్బన్‌ సూపర్‌జెయింట్స్‌ బౌలింగ్‌ కోచ్‌గా పనిచేస్తున్నాడు. 

సౌతాఫ్రికాలో టోర్నీ
ఈ క్రమంలో మెగా టోర్నీ నేపథ్యంలో న్యూజిలాండ్‌ ఈ మేరకు మోర్కెల్‌ నియామకానికి సంబంధించి నిర్ణయం తీసుకోవడం విశేషం. సౌతాఫ్రికాలో ఈ వరల్డ్‌కప్‌ జరుగనున్న తరుణంలో అక్కడి పిచ్‌ల గురించి అవగాహన ఉన్న మేటి బౌలర్‌ను తమ కోచ్‌గా ఎంపిక చేసుకోవడం గమనార్హం.

కాగా 2006- 2018 మధ్య కాలంలో మోర్నీ మోర్కెల్‌ సౌతాఫ్రికా క్రికెట్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. జాతీయ జట్టు తరఫున మొత్తంగా 86 టెస్టులు, 117 వన్డేలు, 44 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అంతర్జాతీయ టెస్టులో 309, వన్డేల్లో 188, టీ20లలో 47 వికెట్లు తీశాడు. ఇక​ న్యూజిలాండ్‌ మహిళా జట్టు ఇటీవలి కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో కాంస్య పతకం గెలిచిన విషయం తెలిసిందే.  కాగా ఫిబ్రవరిలో మహిళ టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీ ఆరంభం కానుంది.

ఐసీసీ మహిళల టి20 ప్రపంచకప్‌
ఫిబ్రవరి 10 నుంచి 26 వరకు
వేదిక: దక్షిణాఫ్రికా
మొత్తం జట్లు: 10

చదవండి: IND vs SL: శ్రేయస్‌ అయ్యర్‌ సూపర్‌ బౌలింగ్‌.. కోహ్లి షాకింగ్‌ రియాక్షన్‌! వీడియో వైరల్‌
Sarfaraz Khan: అప్పుడేమో సిద్ధంగా ఉండమన్నారు! కానీ చివరకు.. నేనూ మనిషినే.. నాకూ భావోద్వేగాలు ఉంటాయి..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top