ODI WC 2023 IND Vs SL: వరుస వైఫల్యాలు.. మాజీ చాంపియన్‌కు ఏమిటీ దుస్థితి? బాధ్యులు మీరే..

WC 2023 Ind vs SL: SLC Seeks Answers From Coaching Staff Selectors - Sakshi

ICC ODI WC 2023: వన్డే వరల్డ్‌కప్‌-2023 శ్రీలంకకు అస్సలు కలిసి రావడం లేదు. నేరుగా టోర్నీకి అర్హత సాధించని కారణంగా క్వాలిఫయర్స్‌ ఆడి ఐసీసీ ఈవెంట్లో అడుగుపెట్టిన ఈ మాజీ చాంపియన్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి.

స్టార్లు దూరం
గాయాల కారణంగా కెప్టెన్‌ దసున్‌ షనక సహా స్టార్‌ ఆల్‌రౌండర్‌ వనిందు హసరంగ, పేసర్లు లాహిరు కుమార, మతీశ పతిరణ జట్టుకు దూరమయ్యారు. ఇలాంటి తరుణంలో జట్టు పగ్గాలు చేపట్టిన కుశాల్‌ మెండిస్‌ జట్టును విజయవంతంగా ముందుకు నడపడంలో విఫలమవుతున్నాడు.

టీమిండియా చేతిలో చావుదెబ్బ
దీంతో ఇప్పటికే సెమీస్‌ రేసు నుంచి నిష్క్రమించిన శ్రీలంక(అనధికారికంగా).. వాంఖడేలో టీమిండియా చేతిలో ఘోర ఓటమిని చవిచూసింది. ముంబైలో గురువారం నాటి మ్యాచ్‌లో 358 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మెండిస్‌ బృందం మరీ ఘోరంగా 55 పరుగులకే కుప్పకూలింది.

టీమిండియా పేసర్లు జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌ ధాటికి టాపార్డర్‌ కకావికలం కాగా.. మరో ఫాస్ట్‌బౌలర్‌ మహ్మద్‌ షమీ ఏకంగా ఐదు వికెట్లతో చెలరేగి మిడిలార్డర్‌, లోయర్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించాడు. దీంతో లంక 302 పరుగుల భారీ తేడాతో చిత్తు చిత్తుగా ఓడింది.

‘సమిష్టి వైఫల్యం’
ఇదిలా ఉంటే.. ఆరంభంలో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో లంక బౌలర్లు ఏకంగా 428 పరుగులు సమర్పించుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బౌలర్ల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడితే.. టీమిండియాతో మ్యాచ్లో బ్యాటర్లు విఫలమైన తీరు విమర్శలకు దారితీసింది.

ఈ నేపథ్యంలో జట్టు ఆట తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న శ్రీలంక క్రికెట్‌ బోర్డు చర్యలకు ఉపక్రమించింది. ఘోర వైఫల్యాలకు గల కారణాలేమిటో వెల్లడించాలంటూ సెలక్టర్లు, కోచ్‌, ఆటగాళ్లకు నోటీసులు ఇచ్చింది. 

షాకింగ్‌ ఓటములు
ఈ మేరకు.. ‘‘ఇప్పటి వరకు ఓవరాల్‌ ప్రదర్శన.. ఇటీవల విస్మయకరరీతిలో భారీ పరాజయాలను చూసిన తర్వాత మెగా టోర్నీకి జట్టు సన్నద్ధతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తున్నారన్న విషయం చర్చనీయాంశమైంది. నిబంధనలకు అనుగుణంగా ప్రొఫెషనల్‌ స్టాఫ్‌ విషయంలో బోర్డు ఏమాత్రం జోక్యం చేసుకోదు. వారి విధులు, బాధ్యతలకు ఆటంకం కలిగించదు.

బాధ్యులు మీరే.. బదులివ్వండి
కానీ.. మీ నుంచి మేము జవాబుదారీతనం, పారదర్శకత కోరుకుంటున్నాం. ఇలాంటి కఠిన పరిస్థితుల నుంచి ఎలా బయట పడాలన్న అంశంపై దృష్టి పెట్టండి. మన జట్టు ఎంపిక, సన్నద్ధత.. తుదిజట్టు కూర్పు విషయంలో ఎలాంటి ప్రణాళికలు రచించారో వివరించండి. జట్టుతో పాటు ప్రతి ఒక్క ఆటగాడి వ్యక్తిగత ప్రదర్శనను అంచనా వేసి.. వారి బలాలు, బలహీనతలు ఏమిటో తెలుసుకోండి.

దృష్టి సారించండి
ఆటగాళ్ల గాయాలు, ఫిట్‌నెస్‌ గురించి ఎలాంటి సమస్యలు ఉన్నా ముందే మా దృష్టికి తీసుకురండి. మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఫలితాన్ని విశ్లేషించి భవిష్యత్తులో పొరపాట్లు దొర్లకుండా చూసుకోండి. కోచింగ్‌ టీమ్‌ ఈ విషయంమై లోతుగా అధ్యయనం చేయాలి’’ అంటూ శ్రీలంక క్రికెట్‌ బోర్డు తమ ప్రకటనలో పేర్కొంది.

మాజీ చాంపియన్‌కు ఏమిటీ దుస్థితి?
కాగా ముంబైలోని వాంఖడేలో 2011లో ఫైనల్లో టీమిండియాకు గట్టిపోటీనిచ్చిన లంక.. ఈసారి అదే వేదికపై 55 పరుగులకే ఆలౌట్ కావడం అభిమానులతో పాటు లంక మాజీ ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు.

సెమీస్‌ మాట పక్కన పెడితే మరీ ఇంత అధ్వాన్న రీతిలో ఓడిపోవాలా? మాజీ చాంపియన్‌కు ఏమిటీ దుస్థితి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా 1996 ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి శ్రీలంక టైటిల్‌ గెలిచిన విషయం తెలిసిందే.  అదే విధంగా 2007, 2011లో వరుసగా రెండుసార్లు ఫైనల్‌ చేరి సత్తా చాటింది.

చదవండి: WC 2023: టీమిండియాకు భారీ షాక్‌! ఐసీసీ ప్రకటన విడుదల

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

11-11-2023
Nov 11, 2023, 21:37 IST
వన్డే ప్రపంచకప్‌-2023ను ఇంగ్లండ్‌ విజయంతో ముగించింది. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన తమ ఆఖరి మ్యాచ్‌లో 93 పరుగుల...
11-11-2023
Nov 11, 2023, 21:09 IST
ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ జో రూట్‌ అరుదైన రికార్డు సాధించాడు. వన్డే ప్రపంచకప్‌ టోర్నీల్లో 1000 పరుగులు చేసిన తొలి...
11-11-2023
Nov 11, 2023, 20:13 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో సెమీఫైనల్‌ బెర్త్‌లు ఖరారయ్యాయి. ఈ మెగా టోర్నీ సెమీఫైనల్స్‌కు భారత్‌, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్లు అర్హత...
11-11-2023
Nov 11, 2023, 19:32 IST
వన్డే ప్రపంచకప్‌-2023లో పాకిస్తాన్‌ కథ ముగిసింది. ఈ మెగా టోర్నీ సెమీఫైనల్‌ రేసు నుంచి పాకిస్తాన్‌ అధికారికంగా నిష్క్రమించింది. ఇంగ్లండ్‌తో...
11-11-2023
Nov 11, 2023, 19:01 IST
పాకిస్తాన్‌ స్టార్‌ పేసర్‌ హ్యారీస్‌ రవూఫ్‌ అత్యంత చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్‌ ఎడిషన్‌ లీగ్‌...
11-11-2023
Nov 11, 2023, 18:20 IST
వన్డే ప్రపంచకప్‌-2023లో తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ను అద్బుతమైన విజయంతో ఆస్ట్రేలియా ముగించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా పుణే...
11-11-2023
Nov 11, 2023, 18:06 IST
వన్డే ప్రపంచకప్‌-2023లో ఇంగ్లండ్‌ ఎట్టకేలకు తమ బ్యాటింగ్‌ విశ్వరూపం చూపించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా తమ ఆఖరి లీగ్‌...
11-11-2023
Nov 11, 2023, 17:15 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో పాకిస్తాన్‌ తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమైంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌ల్లో అదరగొట్టిన పాకిస్తాన్‌.. తర్వాతి...
11-11-2023
Nov 11, 2023, 16:35 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో సెమీస్‌ రేసు నుంచి పాకిస్తాన్‌ నిష్కమ్రిచించడం దాదాపు ఖాయమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఈడెన్‌ గార్డెన్స్‌...
11-11-2023
Nov 11, 2023, 15:47 IST
వన్డే వరల్డ్‌కప్‌లో అఫ్గానిస్తాన్‌ సెమీఫైనల్స్‌కు చేరకపోయినప్పటికీ.. తమ అద్బుత ప్రదర్శనతో అందరిని ఆకట్టుకుంది. తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో...
11-11-2023
Nov 11, 2023, 14:13 IST
ICC WC 2023- Is Pakistan Knocked Out: వన్డే వరల్డ్‌కప్‌-2023లో సెమీస్‌ రేసులో నిలుస్తామంటూ ధీమా వ్యక్తం చేసిన...
11-11-2023
Nov 11, 2023, 13:53 IST
ICC WC 2023- Team India: సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్‌ ట్రోఫీ గెలిచే సత్తా టీమిండియాకు ఉందని వెస్టిండీస్‌ క్రికెట్‌...
11-11-2023
Nov 11, 2023, 11:27 IST
ICC WC 2023: వన్డే ప్రపంచకప​-2023లో అఫ్గనిస్తాన్‌ మునుపెన్నడూ లేని విధంగా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌కు...
11-11-2023
Nov 11, 2023, 10:32 IST
CWC 2023- Australia vs Bangladesh: వన్డే వరల్డ్‌కప్‌-2023 లీగ్‌ దశలో తమ ఆఖరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బంగ్లాదేశ్‌తో తలపడుతోంది....
11-11-2023
Nov 11, 2023, 09:39 IST
భారత్‌ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌-2023 టోర్నీ ముగింపు దశకు చేరుకుంటోంది. ఇప్పటికే టీమిండియా, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్‌ చేరుకోగా.....
11-11-2023
Nov 11, 2023, 08:47 IST
ICC WC 2023- Afghanistan: వన్డే వరల్డ్‌కప్‌-2023లో తమ జట్టు ప్రదర్శన పట్ల అఫ్గనిస్తాన్‌ కెప్టెన్‌ హష్మతుల్లా షాహిది సంతోషం...
10-11-2023
Nov 10, 2023, 21:53 IST
వన్డే ప్రపంచకప్‌-2023లో ఇప్పటికే సెమీస్‌కు చేరిన దక్షిణాఫ్రికా.. మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా...
10-11-2023
Nov 10, 2023, 20:51 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో శ్రీలంక ఆటగాడు ఏంజులో మాథ్యూస్‌ టైమ్డ్‌ ఔట్‌తో చరిత్రకెక్కిన సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీలో భాగంగా...
10-11-2023
Nov 10, 2023, 20:17 IST
దక్షిణాఫ్రికా స్టార్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ క్వింటన్‌ డికాక్‌ అరుదైన ఘనత సాధించాడు. వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీలో ఒక మ్యాచ్‌లో...
10-11-2023
Nov 10, 2023, 19:15 IST
Angelo Mathews Timed Out Row: ‘టైమ్డ్‌ అవుట్‌’ విషయంలో శ్రీలంక ఆల్‌రౌండర్‌ ఏంజెలో మాథ్యూస్‌ను ఉద్దేశించి ఆస్ట్రేలియా మాజీ...

మరిన్ని ఫొటోలు 

Read also in:
Back to Top