వాళ్లకు ఐపీఎల్‌ ఆడితే చాలు.. అంతర్జాతీయ క్రికెట్ వద్దు: పాక్‌ మాజీ కెప్టెన్‌

Wasim Akram reckons Team India not taking international series seriously - Sakshi

Wasim Akram Comments on Team india:  టీ20 ప్రపంచకప్‌2021లో హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన టీమిండియా పేలవ ప్రదర్శనపై మాజీలు, క్రికెట్‌ నిపుణులు, అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ కోవలోనే పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ వసీం అక్రమ్‌ కూడా చేరాడు. పరిమిత ఓవర్లలో  తగినంత అంతర్జాతీయ క్రికెట్ ఆడకపోవడమే భారత్‌ వైఫల్యానికి కారణమని ఆక్రమ్‌ తెలిపాడు. ఈ ప్రపంచకప్‌కు ముందు టీమిండియా వైట్-బాల్ సిరీస్‌లో ఇంగ్లండ్‌తో మాత్రమే తలపడినట్లు  అతడు చెప్పాడు. ఈ ఏడాది యూఏఈలో జరిగిన  ఐపీఎల్‌లో బారత ఆటగాళ్లు పాల్గొన్నప్పటికీ.. అంతర్జాతీయ స్ధాయిలో పోటీ, టీ20 లీగ్‌లకు భిన్నంగా ఉంటుందని అక్రమ్‌ అభిఫ్రాయపడ్డాడు.

“భారత్ చివరిసారిగా  మార్చిలో సీనియర్ ఆటగాళ్లందరితో అంతర్జాతీయ స్ధాయిలో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడింది. ఆ తరువాత పరిమిత ఓవర్లలో  ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. టీమిండియా అంతర్జాతీయ సిరీస్‌లను సీరియస్‌గా తీసుకోవడం లేదు. న్యూజిలాండ్‌తో ఓటమి తర్వాత ఐపీఎల్‌ ఆడితే సరిపోతుందని భారత ఆటగాళ్లు అనుకుంటున్నారు. మీరు లీగ్‌ టోర్నీలు ఆడుతున్నప్పడు ప్రత్యర్థి జట్టులో ఒకరిద్దరు అత్యుత్తమ బౌలర్లు కనిపిస్తారు. కానీ అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదుగురు మంచి బౌలర్లను మీరు ఎదుర్కొంటారు" అని అక్రమ్‌ పేర్కొన్నాడు.

చదవండి: Kevin Pietersen: ఇంగ్లండ్‌పై గెలవగల సత్తా ఆ రెండింటికే.. కప్‌ మాత్రం మాదే!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top