SA Vs IND: కోహ్లి.. ఎలా ఆడాలో రాహుల్‌ని చూసి నేర్చుకో: భారత మాజీ క్రికెటర్‌

Virat Kohli would be unhappy with his performance on day one of 1st SA Test Saya Ashish Nehra - Sakshi

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరోసారి నిరాశ పరిచాడు. తన 71వ సెంచరీ కోసం నిరీక్షణ ఇంకా కొనసాగుతుంది .భారత్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన కోహ్లి, కేఎల్ రాహుల్‌తో కలిసి నాల్గో వికెట్‌కు 82 పరుగులు జోడించాడు. అయితే భారత ఇన్నింగ్స్‌ 69వ ఓవర్ వేసిన లుంగీ ఎంగిడీ బౌలింగ్‌లో రెండో బంతిని ఆఫ్‌సైడ్‌లో ఆడేందుకు కోహ్లి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి ఎడ్జ్‌ తీసుకుని స్లిప్స్‌లో ఉన్న వియాన్ మల్డర్‌కు చేతికి వెళ్లింది. కోహ్లి  94 బంతుల్లో 35 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. ఈ నేపథ్యంలో కోహ్లి ఔటైన తీరుపై భారత మాజీ ఫాస్ట్ బౌలర్‌ ఆశిష్ నెహ్రా ఆసంతృప్తి వ్యక్తం చేశాడు.

"కోహ్లి ఆడితే చూడాలాని చాలా మంది భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం అతడి ఆటతీరుపై అతడే అసంతృప్తిగా ఉంటాడు. కానీ కోహ్లి రికార్డులను పరిశీలిస్తే.. గత ఇంగ్లండ్‌ పర్యటనలో కోహ్లి అధ్బుతంగా రాణించాడు. అదే విధంగా 2028 దక్షిణాఫ్రికా పర్యటనలో సెంచరీ సాధించాడు. అతడు సెంచరీలు,డబుల్ సెంచరీలు సాధించాలనే కసితో ఉన్నాడు. ఇక కోహ్లి ఔటైన తీరు నాకు కాస్త ఆసంతృప్తి కలిగించింది. దక్షిణాఫ్రికా బౌలర్లు కోహ్లికి ఆఫ్‌ స్టంప్‌ వెలుపల బౌలింగ్‌ చేస్తున్నారు. కోహ్లి టెంప్ట్‌ అయ్యి వికెట్‌ను చేజేర్చుకున్నాడు. రాహుల్ ఆడిన విధంగానే కోహ్లి, అటువంటి డెలివరీలను వదిలేయాలని" అని ఆశిష్ నెహ్రా పేర్కొన్నాడు. ఇక తొలి రోజు భారత్‌ మూడు వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. కాగా రెండో రోజు ఆటకు వరుణుడు ఆటంకి కలిగించాడు. దీంతో ఒక్క బంతి కూడా పడకుండానే రోజు ఆట రద్దైంది.

చదవండి: మూడేళ్ల తర్వాత తిరిగి జట్టులోకి.. ఇంకా బయోబబుల్‌లోనే!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top