
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, పాక్ పేసర్ హసన్ అలీ ఒకేలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ అభిప్రాయపడ్డాడు. కోహ్లి గత కొన్నాళ్లుగా తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవతున్నాడని హఫీజ్ తెలిపాడు. కోహ్లి కొద్ది రోజులు పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నట్టే అలీ కూడా విశ్రాంతి తీసుకుంటే బాగుటుందని హఫీజ్ అన్నాడు.
'గత 10 ఏళ్లలో అత్యుత్తమ ఆటగాళ్లలో విరాట్ కోహ్లి ఒకడు. కోహ్లి ప్రస్తుతం తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నాడు. అతడికి ప్రస్తుతం విశ్రాంతి అవసరం. విండీస్ పర్యటనకు కోహ్లికి విశ్రాంతి ఇచ్చి బీసీసీఐ మంచి నిర్ణయం తీసుకుంది. ప్రతి ఆటగాడికి రెస్టు అవసరం. ఈ విరామం కోహ్లి తిరిగి ఫామ్‌లోకి రావడానికి సహాయపడుతుంది. విరాట్ కోహ్లి భారత జట్టులో కీలక ఆటగాడు.
కానీ గత మూడేళ్ల నుంచి అతడు అంతగా రాణించలేకపోతున్నాడు. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై కోహ్లి అర్దసెంచరీ సాధించినప్పటికీ.. అది అతడు స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ కాదు" అని హఫీజ్ పేర్కొన్నాడు. హాసన్ అలీ గురించి మాట్లాడుతూ.. విరాట్ కోహ్లి లాంటి సమస్యనే హాసన్ అలీ కూడా ఎదుర్కొంటున్నాడు. అతడు కూడా చాలా మానసిక ఒత్తిడికి గురయ్యాడు. హాసన్ అలీ సుదీర్ఘ విరామం తీసుకోని తిరిగి మళ్లీ క్రికెట్‌లో అడుగు పెట్టాలని హఫీజ్ తెలిపాడు.
చదవండి: CWG 2022 Ind W Vs Eng W: క్రికెట్‌లో పతకం ఖాయం చేసిన టీమిండియా