ఆస్ట్రేలియాపై గెలుపు.. నాకౌట్‌కు యూఎస్‌ఏ | USA beat Australia 2 0 to book knockout spot at World Cup | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాపై గెలుపు.. నాకౌట్‌కు యూఎస్‌ఏ

Jun 20 2026 4:29 AM | Updated on Jun 20 2026 4:29 AM

USA beat Australia 2 0 to book knockout spot at World Cup

ఫిఫా వరల్డ్‌కప్ 2026కు సహ ఆతిథ్య దేశమైన యూఎస్‌ఏ గ్రూప్‌ దశలో (గ్రూప్‌-డి) వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి నాకౌట్‌కు అర్హత సాధించింది. ఆస్ట్రేలియాపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి రౌండ్ ఆఫ్ 32కు చేరింది. గ్రూప్‌ దశలో మరో మ్యాచ్ (తుర్కియేతో) మిగిలి ఉండగానే ఆరు పాయింట్లు సాధించి తదుపరి దశలోకి ప్రవేశించింది.

ఆసీస్‌తో మ్యాచ్‌కు స్టార్ ఆటగాడు క్రిస్టియన్‌ పులిసిక్‌ గాయంతో దూరమైనప్పటికీ అమెరికా జట్టు ఏమాత్రం తడబడలేదు. మ్యాచ్ ప్రారంభమైన 11వ నిమిషంలో ఆస్ట్రేలియా డిఫెండర్ కెమరూన్‌ బుర్గెస్‌ చేసిన సెల్ఫ్ గోల్ అమెరికాకు తొలి ఆధిక్యాన్ని అందించింది.

ఆ తర్వాత తొలి అర్ధభాగం ముగియడానికి కొద్దిసేపటి ముందు అలెక్స్‌ ఫ్రీమన్‌ హెడ్డర్ ద్వారా రెండో గోల్ సాధించాడు. మొదట ఆఫ్‌సైడ్‌గా ప్రకటించిన ఈ గోల్‌ను వీడియో అసిస్టెంట్ రిఫరీ (VAR) సమీక్ష అనంతరం చెల్లుబాటు అయ్యే గోల్‌గా నిర్ధారించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement