ఐపీఎల్‌-2023లో చెత్తగా ఆడుతుంది వీరే.. వీరితో ఓ జట్టు తయారు చేస్తే ఇలా ..!

Underperforming Players In IPL 2023 After 42 Matches - Sakshi

ఐపీఎల్‌-2023లో స్వదేశీ విదేశీ ఆటగాళ్లు అన్న తేడా లేకుండా భారీ అంచనాలు పెట్టుకున్న చాలామంది ఉసూరుమనిపించారు. వీరి చెత్త ప్రదర్శనతో ఫ్రాంచైజీలతో పాటు అభిమానులు సైతం విసిగివేసారిపోయారు. ఇప్పటివరకు (ఏప్రిల్‌ 30) జరిగిన 42 మ్యాచ్‌ల్లో ఏయే ఆటగాళ్లు దారుణంగా నిరాశపరిచారో, వారందరిని కలిపి ఓ జట్టుగా తయారు చేస్తే ఇలా ఉంటుంది.  

  1. ఓపెనర్లుగా ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాడు పృథ్వీ షా (8 కోట్లు, 6 మ్యాచ్‌ల్లో 47 పరుగులు),
  2. ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (16 కోట్లు, 8 మ్యాచ్‌ల్లో 184 పరుగులు, ఒక్క హాఫ్‌సెంచరీ),
  3. వన్‌ డౌన్‌లో సన్‌రైజర్స్‌ మయాంక్‌ అగర్వాల్‌ (8.25 కోట్లు, 8 మ్యాచ్‌ల్లో 169 పరుగులు),
  4. నాలుగో స్థానంలో లక్నో దీపక్‌ హుడా (5.75 కోట్లు, 8 మ్యాచ్‌ల్లో 52 పరుగులు),
  5. ఐదులో రాజస్థాన్‌ రియాన్‌ పరాగ్‌ (3.80 కోట్లు, 5 మ్యాచ్‌ల్లో 54 పరుగులు),
  6. ఆరులో ఆర్సీబీ దినేశ్‌ కార్తీక్‌ (5.5 కోట్లు, 8 మ్యాచ్‌ల్లో 83),
  7. ఏడో స్థానంలో వాషింగ్టన్‌ సుందర్‌ (8.75 కోట్లు, 7 మ్యాచ్‌ల్లో 60 పరుగులు, 3 వికట్లు),
  8. ఎనిమిదో ప్లేస్‌లో ఆర్సీబీ షాబాజ్‌ అహ్మద్‌ (2.4 కోట్లు, 8 మ్యాచ్‌ల్లో 42 పరుగులు, 0 వికెట్లు),
  9. 9వ స్థానంలో ముంబై ఇండియన్స్‌ జోఫ్రా ఆర్చర్‌ (8 కోట్లు, 3 మ్యాచ్‌ల్లో ఒక్క పరుగు, 2 వికెట్లు),
  10. 10లో కేకేఆర్‌ ఉమేశ్‌ యాదవ్‌ (2 కోట్లు, 8 మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్‌, 19 పరుగులు),
  11. 11వ స్థానంలో కేకేఆర్‌ లోకి ఫెర్గూసన్‌ (10 కోట్లు, 3 మ్యాచ్‌ల్లో 12.52 ఎకానమీతో ఒక్క వికెట్‌).  

వీరు కాక ఇంకా ఎవరైనా చెత్త ప్రదర్శన (కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా రాణించని వారు) చేసిన ఆటగాళ్లు ఉంటే కామెంట్‌ చేయండి. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top