T20 WC 2022: ఉమ్రాన్‌ ప్రపంచకప్‌లో ఆడకపోవడం మంచిదైంది.. మాలిక్‌ తండ్రి ఆసక్తికర వాఖ్యలు

Umran Maliks father breaks silence on son s non selection - Sakshi

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్‌ ఓటమిపాలైనప్పటికీ.. భారత యువ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ మాత్రం అందరినీ ఆకట్టుకున్నాడు. తన తొలి వన్డే మ్యాచ్‌లోనే పేస్‌ బౌలింగ్‌తో పత్యర్ధి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఈ మ్యాచ్‌లో తన 10 ఓవర్ల కోటాలో 66 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. తొలి ఐదు ఓవర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేసిన ఉమ్రాన్‌.. అఖరి ఐదు ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.

అయితే ఓవరాల్‌గా భారత్‌ మూడు వికెట్లు సాధిస్తే.. వాటిలో రెండు ఉమ్రాన్‌వే కావడం గమనార్హం. కాగా ఈ ఏడాది ఐపీఎల్‌ అదరగొట్టిన ఉమ్రాన్‌కు భారత టీ20 జట్టులో చోటు దక్కింది. ఐర్లాండ్‌ సిరీస్‌కు ఎంపికైన ఉమ్రాన్‌ అద్భుతంగా రాణించాడు. అయితే టీ20 ప్రపంచకప్‌ సన్నాహాకాల్లో భాగంగా సీనియర్లకు అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో సెలక్టర్లు మాలిక్‌ను పక్కన పెట్టారు.

అయితే టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ చేతిలో ఘోర పరాభావం తర్వాత భారత జట్టులో ఉమ్రాన్‌ వంటి పేస్‌ బౌలర్లు ఉంటే బాగుండేది అని చాలా మంది మాజీలు అభిప్రాయపడ్డాడు. సెమీఫైన్లలో భారత బ్యాటర్లు పర్వాలేదనిపించినప్పటికీ.. బౌలర్లు కనీసం ఒక్క వికెట్‌ కూడా సాధించలేదు. దీంతో 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైన టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక టీ20 ప్రపంచకప్‌కు ఉమ్రాన్‌ను ఎంపికచేయకపోవడంపై అతడి తండ్రి అబ్దుల్ రషీద్ తాజాగా స్పందించాడు.

ఉమ్రాన్‌ అంతర్జాతీయ వన్డే ఆరంగ్రేటం గురించి న్యూస్‌ 18తో రషీద్‌ మాట్లాడుతూ.. "ఉమ్రాన్‌ టీ20 ప్రపంచకప్‌లో ఆడి ఉంటే బాగుండేది అందరూ అభిప్రాయపడుతున్నారు. మేము అయితే అతడు వరల్డ్‌కప్‌లో ఆడకపోవడం మంచిదైంది భావించాము. ఎందకుంటే ఏది ఎప్పడు జరగాలో అప్పుడే జరుగుతోంది. మనం అనుకున్న వెంటనే జరిగిపోదు కదా.

మనం  దేని వెనుక పరుగెత్తాల్సిన అవసరం లేదు. మాలిక్‌ ఇంకా నేర్చుకునే దశలో ఉన్నాడు. అనుభవజ్ఞులైన వారితో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకుంటున్నాడు. అతడు తన సీనియర్లు నుంచి చాలా విషయాలు నేర్చుకుంటున్నాడు. ఉమ్రాన్‌ త్వరలోనే కీలక బౌలర్‌గా మారుతాడు. అందుకు మనం తొందరపడనవసరం లేదు.

ఇప్పటికే జట్టులో చాలా మంది సీనియర్‌ బౌలర్లు ఉన్నారు. వారి తర్వాత ఉమ్రాన్‌కు ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది. ఇక ఎస్‌ఆర్‌హెచ్‌ తరపున ఆడుతున్నప్పుడు కేన్‌ విలియమ్సన్‌కు నెట్స్‌లో బౌలింగ్‌ చేసేవాడు. ఇప్పుడు ఒకరికొకరు ప్రత్యర్థులుగా నా భార్యకు చెప్పాడు. ఇది గురువు- శిష్యుడి మధ్య పోటీలా అనిపించింది" అని అతడు పేర్కొన్నాడు.
చదవండి: IND vs NZ: మరోసారి విలన్‌గా మారిన వర్షం.. న్యూజిలాండ్‌- భారత్‌ రెండో వన్డే రద్దు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top