ప్రకృతితో ఆటలాడితే అధోగతే! మంచు దుప్పటిలో ప్రసిద్ధ స్టేడియం! గుర్తుపట్టారా?

UK Oval Stadium Covered With Snow Photo Video Goes Viral - Sakshi

Snowfall In London: యునైటెడ్‌ కింగ్‌డంలో చలి పులి పంజా విసురుతోంది. వాతావరణంలో భారీ మార్పుల నేపథ్యంలో ఉష్ణోగ్రతలు మైనస్‌ 10- 12 డిగ్రీలకు పడిపోతున్నాయి. మంచు విపరీతంగా కురుస్తోంది. ఈ నేపథ్యంలో బ్రిటన్‌లో ఎటు చూసినా మంచుతో కప్పబడిన ప్రదేశాలే దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో ఆ దేశ వాతావరణ పరిస్థితికి సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి.

ఈ క్రమంలో ప్రసిద్ధ ఓవల్‌ క్రికెట్‌ స్టేడియానికి సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. గ్రౌండ్‌ మొత్తం పూర్తిగా ‘మంచు దుప్పటి’తో కప్పబడి ఉంది. మైదానంలో ఎటు చూసినా పెద్ద ఎత్తున మంచు పేరుకుపోయింది. ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

‘‘వాతావరణ మార్పుల కారణంగానే ఇలాంటి విపత్కర పరిస్థితులు. ప్రకృతితో ఆటలాడితే మనుషుల గతి అధోగతే! ఏదేమైనా.. ఓవల్‌ మైదానం సూపర్‌గా కనిపిస్తోంది. క్రికెట్‌కు బదులు ఇక్కడ ఐస్‌ హాకీ ఆడుకోవచ్చు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఉష్ణోగ్రతలు పెద్ద ఎత్తున పడిపోతున్న నేపథ్యంలో బ్రిటన్‌ ప్రజలు చలికి వణికిపోతున్నారు. బయటకు వెళ్లే పరిస్థితి లేక ఇబ్బందులు పడుతున్నారు. రవాణా వ్యవస్థ కూడా స్తంభించిపోయింది.

ది ఓవల్‌ క్రికెట్‌ స్టేడియం
దక్షిణ లండన్‌లోని కెన్నింగ్‌టన్‌లో ఉందీ స్టేడియం. 1845లో దీనిని ప్రారంభించారు. అప్పటి నుంచి ఇది సర్రే క్రికెట్‌ కంట్రీ క్లబ్‌కు హోం గ్రౌండ్‌గా ఉంది. 1880లో మొదటి అంతర్జాతీయ టెస్టుకు ఇంగ్లండ్‌ ఇక్కడే ఆతిథ్యమిచ్చింది. కాగా ప్రతి సీజన్‌లో స్వదేశంలో ఆఖరి టెస్టును ఇంగ్లండ్‌ ఇక్కడే ఆడటం ఆనవాయితీగా కొనసాగుతోంది.

👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: IND vs BAN: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు.. అక్షర్‌కు నో ఛాన్స్‌! ఆల్‌రౌండర్‌ అరంగేట్రం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top