టీ20 వరల్డ్‌కప్-2026కు ముందు సౌతాఫ్రికాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్లు టోనీ డి జోర్జి, డోనోవన్ ఫెరీరా గాయాల కారణంగా ఈ మెగా టోర్నీకి దూరమయ్యారు. వారిద్దరి స్ధానంలో వికెట్ కీపర్ బ్యాటర్లు ట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రికెల్టన్ వరల్డ్‌కప్ జట్టులోకి వచ్చారు.
ఈ విషయాన్ని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు గురువారం ప్రకటించింది. టోనీ డి జోర్జి విషయానికి వస్తే.. గతేడాది ఆఖరిలో భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అతడికి కుడి కాలికి గాయమైంది. అతడు వరల్డ్‌కప్ సమయానికి కోలుకుంటాడని ప్రోటీస్ సెలక్టర్లు భావించారు. కానీ టోనీ పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి మరింత సమయం పడుతోంది.
ఈ క్రమంలోనే అతడు పొట్టి ప్రపంచకప్‌నకు దూరమయ్యాడు. మరోవైపు సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26లో ఫెరీరా గాయపడ్డాడు. ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫెరీరా(జోబర్గ్ సూపర్ కింగ్స్) భుజం ఎముక విరిగింది. దీంతో అతడు కూడా ఈ మెగా టోర్నీకి అందుబాటులో ఉండటం లేదు. ఈ క్రమంలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రికెల్టన్, స్టబ్స్‌కు సెలక్టర్లు పిలుపునిచ్చారు.
అదేవిధంగా ఈ మెగా టోర్నీ విధ్వంసకర ప్లేయర్ డేవిడ్ మిల్లర్ కూడా దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. మిల్లర్ ప్రస్తుతం కండరాల గాయంతో బాధపడుతున్నాడు. దీంతో వరల్డ్‌కప్ ముందు వెస్టిండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌కు మిల్లర్ దూరమయ్యాడు. అతడిస్ధానంలో రూబెన్ హెర్మన్‌కు చోటు ఇచ్చారు.
టీ20 ప్రపంచకప్-2026కు సౌతాఫ్రికా జట్టు
ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, క్వింటన్ డి కాక్, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, జార్జ్ లిండే, కేశవ్ మహరాజ్, క్వేనా మఫాకా, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే, కగిసో రబడా, జాసన్ స్మిత్.
వెస్టిండీస్‌తో టీ20లకు ప్రోటీస్ జట్టు
ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, క్వింటన్ డి కాక్, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, జార్జ్ లిండే, కేశవ్ మహరాజ్, క్వేనా మఫాకా, హెర్మన్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే, కగిసో రబడా, జాసన్ స్మిత్.


