Sachin Tendulkar: బ్రెట్‌ లీ బౌలింగ్‌లో ట్రేడ్‌మార్క్‌ షాట్‌.. ఎన్నాళ్లయిందో

Travel Back In Time As Sachin Tendulkar Hits Brett Lee For Majestic Boundary - Sakshi

క్రికెట్‌లో కొన్ని పోటీలు(Rivalries) గమ్మత్తుగా ఉంటాయి. ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. వాటికి కల్ట్‌ఫ్యాన్స్‌ కూడా ఉంటారు. రెండు దశాద్దాల కింద చూసుకుంటే మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌కు బంతులు వేయడానికి ప్రత్యర్థి బౌలర్లు వణికిపోయేవారు. ఎందుకంటే అప్పట్లో సచిన్‌ ఫామ్‌ భీకరమైన స్థాయిలో ఉండేది. అలాంటి చూడముచ్చటైన ఆటలో సచిన్‌ కొన్నిసార్లు గెలిస్తే.. మరికొన్నిసార్లు ప్రత్యర్థి బౌలర్లు పైచేయి సాధించేవారు. ముఖ్యంగా సచిన్‌-బ్రెట్‌ లీ, సచిన్‌-షోయబ్‌ అక్తర్‌ల మధ్య పోటీని అభిమానులు ఎగబడి చూసేవారు.

ఇక ఆస్ట్రేలియా ఫాస్ట్‌ బౌలర్‌ బ్రెట్‌ లీ బౌలింగ్‌ సచిన్‌ కొట్టే స్వ్కేర్‌లెగ్‌ కవర్‌డ్రైవ్‌ షాట్‌కు ఎంతో మంది అభిమానులు ఉంటారు. సచిన్‌ ఈ షాట్‌ను లీ బౌలింగ్‌లో చాలాసార్లు ఆడేవాడు. అలాంటి ట్రేడ్‌మార్క్‌ షాట్లు చూసి చాలా కాలమైన తరుణంలో రోడ్‌సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌ పుణ్యమా అని అభిమానులు మరోసారి అలాంటి ట్రేడ్‌మార్క్‌ షాట్లను చూడగలుగుతున్నారు. మొన్నటికి మొన్న సచిన్‌ ఫ్రంట్‌ఫుట్‌ వచ్చి లాంగాన్‌ మీదుగా సిక్సర్‌ బాదడం చూసి వింటేజ్‌ సచిన్‌ను చూపించాడురా అనుకున్నాం.

తాజాగా గురువారం ఆస్ట్రేలియా లెజెండ్స్‌తో జరిగిన సెమీఫైనల్‌లో సచిన్‌ బ్రెట్‌ లీ బౌలింగ్‌లో తొలి బంతినే ఎక్స్‌ట్రా కవర్స్‌ మీదుగా ఆణిముత్యంలాంటి బౌండరీ బాదాడు. దీన్ని చూసిన అభిమానులు మా కళ్లు ఎంత పుణ్యం చేసుకున్నాయో.. దశాబ్దంన్నర కింద ఇలాంటి షాట్లు చూశాం.. మళ్లీ ఇప్పుడు అంటూ కామెంట్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక సెమీఫైనల్లో ఆస్ట్రేలియా లెజెండ్స్‌పై టీమిండియా లెజెండ్స్‌ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా లెజెండ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ఇండియా లెజెండ్స్‌ నమన్‌ ఓజా(90 నాటౌట్‌), ఇర్ఫాన్‌ పఠాన్‌(37 నాటౌట్‌) రాణించి జట్టును గెలిపించారు. 

చదవండి: బుమ్రా దూరం.. సరైన బౌలర్లు లేరు; టీమిండియాకు కష్టమే!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top