ఆరు నెలలుగా బయోబబూల్‌.. మమ్మల్ని బాగా దెబ్బతీస్తుంది | T20 World Cup 2021: Bumrah Says Need Rest Bio-bubble Suffers Team India | Sakshi
Sakshi News home page

Jasprit Bumrah: ఆరు నెలలుగా బయోబబూల్‌.. మమ్మల్ని బాగా దెబ్బతీస్తుంది

Nov 1 2021 5:20 PM | Updated on Nov 1 2021 5:30 PM

T20 World Cup 2021: Bumrah Says Need Rest Bio-bubble Suffers Team India - Sakshi

Jasprith Bumrah Says Bio Bubble Suffers Team India.. టీమిండియా పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా బయోబబూల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయంలో బీసీసీఐ ఆలోచించి బయోబబూల్‌పై ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. టి20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ అనంతరం బుమ్రా మీడియాతో మాట్లాడాడు.

''ఈ సమయంలో మాకు విశ్రాంతి అవసరం చాలా ఉంది. ఆరు నెలలుగా బయోబబూల్‌లో కాలం గడుపుతుండడంతో ఫ్యామిలీని మిస్‌ అవుతున్నట్లు అనిపిస్తుంది. ఆరు నెలల పాటు ఫ్యామిలీకి దూరంగా ఉండడ అనేది మా మానసిక ఉత్సాహాన్ని దెబ్బతీస్తుంది. దీంతో ఆ ప్రభావం మా ఆటపై పడుతుంది. ఫ్యామిలీని తీసుకెళ్లొచ్చు అని బీసీసీఐ కొన్ని ఆంక్షలు సడలించినప్పటికీ మాకు ఇబ్బందిగానే అనిపిస్తుంది.'' అని చెప్పుకొచ్చాడు.

చదవండి: T20 WC 2021: కోహ్లికి జట్టు నుంచి సపోర్ట్‌ లేదా?!

ఇక  టీమిండియా ఆరు నెలలుగా బిజీ షెడ్యూల్‌తో ఉంది. జూన్‌లో ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌ మొదలుకొని.. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌.. అటుపై ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌.. తాజాగా ఇప్పుడు టి20 ప్రపంచకప్‌లో పాల్గొంటుంది. గత ఆరునెలలుగా టీమిండియా పూర్తిగా బయోబబూల్‌లోనే ఉంటుంది. ఇక న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో సెమీస్‌ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకున్న టీమిండియా టోర్నీ నుంచి దాదాపు నిష్క్రమించినట్లే. ఇక మిగిలిన మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలిచినప్పటికి మిగతా జట్లపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇక టీమిండియా తన తర్వాతి మ్యాచ్‌ను బుధవారం(నవంబర్‌ 3) అఫ్గనిస్తాన్‌తో ఆడనుంది.

చదవండి: T20 World Cup 2021 Ind Vs NZ: టోర్నీ నుంచి నిష్క్రమించినట్లేనా.. ఇంకా అవకాశం ఉందా?! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement