T20 WC 2021: కోహ్లికి జట్టు నుంచి సపోర్ట్‌ లేదా?!

T20 World Cup 2021: News Troll Social Media Kohli Not Get Support From Team - Sakshi

News In Social Media Kohli Not Get Support From Team India.. టి20 ప్రపంచకప్‌ 2021లో భాగంగా టీమిండియా దారుణ ఆటతీరు కనబరుస్తున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో భారీ తేడాతోనే పరాజయం పాలైంది. రెండు వరుస ఓటములతో టీమిండియాకు సెమీస్‌ అవకాశాలు దాదాపు మూసుకుపోయినట్లే. ఒకవేళ టీమిండియా సెమీస్‌ చేరాలంటే న్యూజిలాండ్‌ మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో రెండు ఓడిపోవాలి.. అదే సమయంలో అఫ్గనిస్తాన్‌ తనకు మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో ఓడిపోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది అసాధ్యం. కాబట్టి టి20 ప్రపంచకప్‌లో టీమిండియా పోరు సూపర్‌ 12 దశలోనే వెనుదిరగాల్సి వస్తుంది.

చదవండి: T20 World Cup 2021: టీమిండియా.. 22 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే

ఈ విషయం పక్కడపెడితే తాజాగా ఒక వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి జట్టు నుంచి ఎంతమాత్రం సపోర్ట్‌ లేదంటూ వార్తలు బయటికి రావడం ఆసక్తి కలిగించింది. కోహ్లికి టి20 కెప్టెన్‌గా ఇదే చివరి టి20 ప్రపంచకప్‌.. ఈ టోర్నీ తర్వాత అతను కెప్టెన్సీ నుంచి వైదొలగనున్నాడు. ఈ నేపథ్యంలోనే ఒకవేళ టీమిండియా కప్‌ గెలవకపోతే ఆ ప్రభావం కోహ్లిపై పడుతుందనే ఉద్దేశంతోనే ఆటగాళ్లు సపోర్ట్‌కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ధోనిని బీసీసీఐ ఏరికోరి మెంటార్‌గా తీసుకొచ్చింది.

అయితే ధోని చెప్పిన సూచనలు కోహ్లి పెడచెవిన పెట్టాడని..కెప్టెన్‌గా సొంత నిర్ణయాలు తీసుకోవడంతో న్యూజిలాండ్‌, పాక్‌ మ్యాచ్‌ల్లో టీమిండియా ఓటమికి పరోక్షంగా కారణమయ్యాయని సమాచారం. ఈ వార్తల్లో నిజం ఎంత అనేది తెలియకపోయినప్పటికి న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో కనిపించిందంటూ ఫ్యాన్స్‌ పేర్కొన్నారు.  ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఇది హాట్‌టాఫిక్‌గా మారింది.

చదవండి: Virat Kohli On India Loss: అలా చేయలేకపోయాం.. అందుకే రెండింటిలో ఓడిపోయాం..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top