IND Vs PAK: చరిత్ర సృష్టించిన పాక్‌ ఓపెనర్లు.. 

T20 World Cup 2021: Babar Azam Rizwan Break T20 Record Highest Partner Ship - Sakshi

Babar Azam And Mohammad Rizwan Breaks T20 Record Highest Partnership.. టి20 ప్రపంచకప్‌ 2021లో పాకిస్తాన్‌ ఓపెనర్లు బాబర్‌ అజమ్‌, మహ్మద్‌ రిజ్వాన్‌ చరిత్ర సృష్టించారు. టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో 152 పరుగుల లక్ష్యాన్ని ఇద్దరే చేధించడం విశేషం. ఒక టి20 ప్రపంచకప్‌లో ఒక మ్యాచ్‌లో వికెట్‌ కోల్పోకుండా జట్టును గెలిపించిన సందర్భాలు ఇప్పటివరకు మూడుసార్లు మాత్రమే జరిగాయి. 2007లో శ్రీలంకపై 102/0,  2012లో జింబాబ్వేపై దక్షిణాప్రికా 94/0, 2021లో పపువా న్యూ గినియాపై ఒమన్‌ 130/0 ఉన్నాయి. తాజాగా టీమిండియాపై పాకిస్తాన్‌ 152/0తో చోటు దక్కించుకుంది.

చదవండి: T20 WC 2021: ఇంత కసి దాగుందా.. టీమిండియా రికార్డును బ్రేక్‌ చేసిన పాకిస్తాన్‌

అంతేగాక టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో బాబర్‌ అజమ్‌, మహ్మద్‌ రిజ్వాన్‌ మరో రికార్డు సాధించారు. తొలి వికెట్‌కు 152 పరుగులు జోడించిన ఈ ఇద్దరు.. టి20ల్లో పాక్‌ తరపున ఏ వికెట్‌కైనా అత్యధిక పరుగుల భాగస్వామ్యంగా నిలిచింది. ఇంతకముందు 2012 టి20 మ్యాచ్‌లో మహ్మద్‌ హఫీజ్‌, షోయబ్‌ మాలిక్‌ జంట నాలుగో వికెట్‌కు 104 పరుగులు జోడించడం ఇప్పటివరకు అత్యుత్తమంగా ఉంది.

చదవండి: SL Vs BAN: బ్యాట్స్‌మన్‌ కంటే వేగంగా పరిగెత్తాడు.. రిస్క్‌ అని తెలిసినా

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top