
PC: James Neesham Via Twitter
అందరూ లేచి గంతులేశారు.. కానీ జిమ్మీ నీషమ్ మాత్రం.. ఫొటో వైరల్.. పని పూర్తైందా? ఇంకా లేదేమో!
James Neesham didn’t celebrate after NZ cruised through T20 WC final Pic Goes Viral: న్యూజిలాండ్ ఏళ్లనాటి కలను నిజం చేయడంలో కీలకంగా వ్యవహరించాడు జేమ్స్ నీషమ్. 2007 టీ20 వరల్డ్‌కప్ నుంచి ఒక్కసారి కూడా ఫైనల్ చేరలేదన్న అపఖ్యాతిని చెరిపివేయడంలో ఈ స్టార్ ఆల్‌రౌండర్ తన వంతు పాత్ర పోషించాడు. కాగా టీ20 వరల్డ్‌కప్-2021లో భాగంగా ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో కివీస్ అద్భుత విజయం సాధించి తుది పోరుకు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. నిజానికి కివీస్ లక్ష్యఛేదనలో 16 ఓవర్ల దాకా ఇంగ్లండ్ ఆధిపత్యమే కొనసాగింది.
అయితే ఆ తర్వాత నీషమ్ ఎంట్రీ మోర్గాన్ బృందాన్ని కోలుకోలేని దెబ్బకొట్టింది. 11 బంతుల్లో 27 పరుగులతో నీషమ్ చెలరేగడంతో.. ఓవర్ మిగిలుండగానే న్యూజిలాండ్ టార్గెట్‌ను ఛేదించింది. 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా ఐసీసీ ప్రపంచకప్ పోరులో తమను గెలుపునకు దూరం చేస్తున్న ఇంగ్లండ్‌ను దెబ్బకు దెబ్బ కొట్టి ప్రతీకారం తీర్చుకుంది.
దీంతో విలియమ్సన్ బృందం సంబరాలు అంబరాన్నంటాయి. డగౌట్‌లో కూర్చున్న ఆటగాళ్లు, సిబ్బంది ఒక్కసారిగా గెంతులు వేశారు. అయితే, ‘హీరోచిత’ ఇన్నింగ్స్ ఆడిన జేమ్స్ నీషమ్ మాత్రం గంభీరంగా చూస్తూ.. తన సీట్లోనే కూర్చుండిపోయాడు. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఈ క్రమంలో ఈఎస్‌క్రిక్‌ఇన్ఫో ఈ ఫొటోను షేర్ చేసి.. జిమ్మీ నీషమ్ మాత్రం కదల్లేదు అని క్యాప్షన్ జతచేయగా.. అతడు స్పందించాడు. ‘‘పని పూర్తైందా? ఇంకా కాలేదనే అనుకుంటున్నాను’’ అంటూ ట్వీట్ చేశాడు. ఫైనల్ వరకు చేరడం ఓకే.. ఇక ట్రోఫీ గెలవడంలో ఏమాత్రం అలసట వద్దు అన్న ఉద్దేశంలో జిమ్మీ ఇలా వ్యాఖ్యానించాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Job finished? I don’t think so. https://t.co/uBCLLUuf6B
— Jimmy Neesham (@JimmyNeesh) November 10, 2021