లక్నో సూపర్‌ జెయింట్స్‌ కీలక నిర్ణయం..!? సురేష్‌ రైనాకు.. |Suresh Raina Hints At Joining Lucknow Super Giants As Team Mentor For IPL 2024, See Details Inside - Sakshi
Sakshi News home page

IPL 2024: లక్నో సూపర్‌ జెయింట్స్‌ కీలక నిర్ణయం..!? సురేష్‌ రైనాకు..

Published Sun, Dec 24 2023 4:32 PM

Suresh Raina Hints At Joining Lucknow Super Giants As Team Mentor For IPL 2024 - Sakshi

ఐపీఎల్‌-2024 సీజన్‌కు ముందు లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తమ జట్టు మెంటార్‌గా టీమిండియా మాజీ ఆటగాడు, సీఎస్‌కే లెజెండ్‌ సురేష్ రైనాను నియమించేందుకు ఎల్‌ఎస్‌జి సిద్దమైనట్లు సమాచారం. ఇప్పటికే అతడితో లక్నో ఫ్రాంచైజీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా రైనా చేసిన ట్వీట్‌ ఈ వార్తలకు మరింత ఊతమిస్తోంది.

'లక్నో ఫ్రాంచైజీతో రైనా ఒప్పందం కుదర్చుకోలేదని, అవన్నీ తప్పుడు వార్తలేనని' ఓ జర్నలిస్ట్‌ ఓ ట్వీట్‌ చేశాడు. అందుకు రైనా స్పందిస్తూ.. ఈ వార్తలు ఎందుకు నిజం కాకూడదు? అంటూ రిప్లే ఇచ్చాడు. దీంతో రైనాను కొత్త అవతారంలో చూడడం ఖాయమని అభిమానులు ఫిక్స్‌ అయిపోయారు.

కాగా గత రెండు సీజన్లగా తమ జట్టు మెంటార్‌గా ఉన్న గౌతం గంభీర్‌ను.. ఐపీఎల్‌-2024 వేలానికి ముందు లక్నో ఫ్రాంచైజీ విడిచిపెట్టింది.  ప్రస్తుతం లక్నో మోంటార్‌ పదవి ఖాళీగా ఉంది. ఈ క్రమంలోనే గంభీర్‌ స్ధానాన్ని మిస్టర్‌ ఐపీఎల్‌తో భర్తీ చేసేందుకు సిద్దమైంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఒకట్రెండు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది.

ఇక ఐపీఎల్‌లో సురేష్‌ రైనా అద్భుతమైన రికార్డు ఉంది. మిస్టర్‌ ఐపీఎల్‌గా పేరొందిన రైనా 205 మ్యాచ్‌లాడి 5528 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 39 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. సీఎస్‌కే నాలుగుసార్లు ఛాంపియన్‌గా(మొత్తంగా ఐదుసార్లు) నిలవడంలో​ రైనా పాత్ర కీలకం.

Advertisement
 
Advertisement