
పల్లెకెలె: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో ఆతిథ్య శ్రీలంక జట్టు 26 పరుగుల తేడాతో డక్‌వర్త్ లూయిస్(డీఎల్) పద్ధతిలో గెలిచింది. వర్షంతో మొదట 47.4 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక 9 వికెట్లకు 220 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ (36), ధనంజయ (34), కెప్టెన్ షనక (34) మెరుగ్గా ఆడారు. తర్వాత మళ్లీ వర్షం రావడంతో డీఎల్ పద్ధతిలో ఆస్ట్రేలియాకు 43 ఓవర్లలో 221 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.
అయితే ఆసీస్ 37.1 ఓవర్లలో 189 పరుగులకే కుప్పకూలింది. వార్నర్ (37) టాప్ స్కోరర్ కాగా, లంక బౌలర్లలో కరుణరత్నే 3, వెల్లలగే, చమీర, ధనంజయ తలా 2 వికెట్లు తీశారు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరుజట్లు 1–1తో సమంగా ఉన్నాయి.